Suryaa.co.in

Political News

నాయుడు గారు చెప్పింది నిజమే…కానీ

చేపను పట్టడం నేర్పించండి కానీ చేప ఇవ్వొద్దు. ఉచితాలు పనికిరావు అంటూ పెద్దలు వెంకయ్య నాయుడు గారు హితబోధ చేశారు.
బాగానే ఉంది సర్ కానీ …
2014 ఎన్నికల్లో అల్ ఫ్రీ బాబు 640 వాగ్దానాలు చేస్తే అప్పుడు టీడీపీ తో పొత్తులో ఉన్నమీరు నోరు తెరవలేదు నాయుడు గారు !!!
పైగా రైతు రుణమాఫీ బాబుకే సాధ్యం కాబట్టి బాబును గెలిపించండి అని ఎన్నికల సభలో ప్రచారం చేసారు వెంకయ్య నాయుడు గారు
చివరికి ఎన్నికల కమీషన్ సైతం 87 ,612 కోట్ల రైతు రుణాలను ఎలా తీరుస్తావో చెప్పు అంటూ బాబుకు లేఖ రాస్తే నేను MA ఎకనామిక్స్ నాకు తెలుసు , చేసి చూపిస్తా అని బదులిచ్చాడు బాబు.
(నాడు జగన్ కనీసం 50 వేల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తా అని చెప్పినా గెలుస్తాను అని తెలిసి కూడా అలివికాని వాగ్దానాలు చేయ కూడదు అని చేయలేదు )
సరే మాయమాటలు చెప్పి సీఎం అయినాక బాబు కోటయ్య (చౌదరి) కమిటీ అని వేసి స్కెల్ అఫ్ ఫైనాన్స్ అని చెప్పి 24 వేల కోట్లకు కుదించి ఇచ్చింది 15 వేల కోట్లు.
ఇక డ్వాక్రా రుణాలు 14 వేల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టాడు బాబు.
అయినా నాడు ఏమి అనలేదు నాయుడు గారు !!!
[2014లో డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు అయితే చంద్రబాబు వాటిని మాఫీ చేస్తానని చేయకపోవడంతో 2019 ఏప్రిల్‌ నాటికి రూ.25,517 కోట్లకు చేరాయి
గతేడాది మొదటి విడతగా రూ.6,319 కోట్లు, ఈ ఏడాది అక్టోబర్‌ 7–18 తేదీల మధ్య రూ.6,440 కోట్లు మొత్తం రూ.12,759 కోట్లు పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చినట్టు అయింది జగన్ ప్రభుత్వం ]
Note : రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని విమర్శించకూడదు కాబట్టి నో కామెంట్స్ ప్లీజ్

– ఉమా

LEAVE A RESPONSE