Suryaa.co.in

Andhra Pradesh

దీపం-2 పథకం ప్రారంభం..

స్వయంగా టీ తయారు చేసిన సీఎం

సీఎం చంద్రబాబు దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికెళ్లి ఉచిత సిలిండర్ బిగించి స్టవ్ వెలిగించి, పాలు మరిగించారు. స్వయంగా టీ తయారు చేశారు. మహిళ కుటుంబసభ్యులతో కలిసి టీ తాగారు. సీఎం వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE