Suryaa.co.in

Andhra Pradesh

ఎయిర్ ట్యాక్సీ తయారుచేసిన అభిరామ్‌కు సీఎం చంద్రబాబు అభినందన

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబును గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్ చావా కలిశారు. ఇటీవల తాను తయారుచేసిన ఎయిర్ ట్యాక్సీ గురించి సచివాలయంలో సీఎంను కలిసి వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్‌ను సీఎం అభినందించారు. ఎయిర్ ట్యాక్సీ వివరాలు, సెక్యూరిటీ ఫీచర్స్, తయారీకి అయిన ఖర్చు వంటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రెండుసీట్ల సామర్థ్యంతో ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేశానని అభిరామ్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు సివిల్ ఏవియేషన్ అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కేంద్రంతో మాట్లాడి సహకారం అందిస్తామని సీఎం అన్నారు. ఈ పరిశోధనలు కొనసాగించాలని అభిరామ్‌కు సీఎం సూచించారు.

LEAVE A RESPONSE