– ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, నేతలు, అధికారులు
అనంతపురం: నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంగళవారం రోజు నేడు అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రులు, నేతలు సమీక్షించారు. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తదితరులతో సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కడప రీజినల్ ఏపీఎస్ఆర్టీసీ చైర్ పర్సన్ పూల నాగరాజు, జోన్4 కడప ఏపీఎస్ఆర్టీసీ ఈడి చంద్రశేఖర్, డిటిసి వీర్రాజు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, డిప్యూటీ కమిషనర్ పావని, మెప్మా పిడి విశ్వజ్యోతి, నాయకులు పాల్గొన్నారు.