– రూ.553 కోట్లతో జీవీఎంసీ జోన్ 2 లో భూగర్భ డ్రైనేజ్ కి ఐఎఫ్ సీ తో ఒప్పందం శుభపరిణామం
– దేశంలోనే తొలిసారి ఐఎఫ్ సీ రుణం పొందిన తొలి కార్పొరేషన్ గా జీవీఎంసీ చరిత్రకెక్కింది
– విశాఖను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మరింత అభివృద్ధి చేస్తాం
– జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి: విశాఖ నగర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.553 కోట్లతో జీవీఎంసీ జోన్ 2 లో భూగర్భ డ్రైనేజ్ కి ఐఎఫ్ సీ తో ఒప్పందం శుభపరిణామం. దీంతో దేశంలోనే తొలిసారి ఐఎఫ్ సీ రుణం పొందిన తొలి కార్పోరేషన్ గా జీవీఎంసీ చరిత్రకెక్కింది. ఈ ఒప్పందం ద్వారా దేశంలో నగరాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి సీఎం చంద్రబాబు నాయుడు నూతన ఒరబడి తీసుకొచ్చారు.
ఈ ప్రాజెక్టుతో జీవీఎంసీ జోన్ 2 లో 100 శాతం అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, మోడల్ పంపింగ్, లిఫ్టింగ్ స్టేషన్లు, అత్యాధునిక శుద్ధి కేంద్రం, నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్ తో విశాఖ ప్రజలకు ఎంతో ఉపయోగం. 30 ఏళ్ల జనాభా వృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని డిజైన్ జీవీఎంసీ అధికారులకు అభినంధనలు. విశాఖను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.