– దైవ దర్శనాని కంటూ వచ్చి రాజకీయాలు మాట్లాడతారా?
– ఎన్ని వినాయక మంటపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చారు?
– 2018 లో మీ హయాంలోనే డూండీ సంస్థ గణేష్ ఉత్సవాలు నిలిపివేసింది
– అనుమతులు ఇవ్వలేదని వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిందలు ఎలా మోపుతున్నారు?
– వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
తాడేపల్లి: పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాల్లో స్వామి వారి దర్శనం అంటూ వెళ్ళి, దైవం సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన ఘనుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.
హిందూధర్మాన్ని పాటించే వారెవరైనా భగవంతుడి సమక్షంలో ఆధ్యాత్మిక అంశాలు తప్ప, రాజకీయాలు మాట్లాడకూడదనే కనీస ఇంగితాన్ని పాటిస్తారని, చంద్రబాబుకు మాత్రం ఇవేమీ పట్టవని ధ్వజమెత్తారు.
వినాయకచవితి నాడు ఉదయం తాడేపల్లిలో గణేష్ ఉత్పవంలో, పూజా కార్యక్రమంలో మాజీ సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ విషయం తెలియగానే సాయంత్రానికి షెడ్యూల్లో లేకపోయినా కూడా సీఎం చంద్రబాబు భవానీపురంలోని వినాయకపందిరిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన రాజకీయ విమర్శలను, వైయస్ జగన్ గారిన ఉద్దేశించిన మోపిన నిందలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనలు ముందుగానే ఖరారవుతాయి. అత్యవసరం అయితే తప్ప షెడ్యూల్ లేని కార్యక్రమాలకు సీఎం హాజరుకారు. అలాంటిది వినాయకచవితి పర్వదినం గురించి ముందుగానే అందరికీ తెలుసు. సీఎం హోదాలో చంద్రబాబు హాజరవుతారంటే, దానికి గానూ ముందుగానే షెడ్యూల్ కూడా ఖరారు చేసి, ప్రకటిస్తారు.
దేవుడి సమక్షంలో కూడా చంద్రబాబు కళ్ళార్పకుండా అబద్దాలు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో, ఎటువంటి విషం చిమ్మారో, రాజకీయ ప్రసంగాలతో ఆద్యాత్మిక వాతావరణాన్ని ఎలా కలుషితం చేశారో ప్రజలంతా చూశారు.
గత అయిదేళ్ళ పాటు వైయస్ఆర్సీపీ పాలనలో సింగిల్ విండో విధానాన్ని అమలు చేసింది. వివిధ శాఖలకు చెందిన వారి నుంచి అనుమతులు తీసుకోవడం ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బంది అవుతుందని గమనించి, ఒకే దగ్గర అన్ని అనుమతులను తీసుకునేందుకు వీలు కల్పించింది.
వినాయకచవితి పందిళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చామని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎన్ని పందిళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చారో చెప్పై దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ప్రతి గణపతి మంటపం నుంచి కనీసం రూ.1000 చొప్పున కట్టించుకుంటున్నారు. ఇది భరించలేక చాలా వినాయక మంటపాల్లో తమ ఇళ్ళ నుంచి కరెంట్‌ను స్వచ్ఛందంగా ఇచ్చారు.
నిన్న వినాయక మంటపంలో చంద్రబాబు మాట్లాడుతూ డూండీ గణేష్ సంస్థ గురించి మాట్లాడారు. 2015, 2016 లో ఇదే సంస్థ ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో గణేష్ వేడుకలను నిర్వహించింది. 2017 లో జింఖానా గ్రౌండ్స్‌లో ఈ వేడుకలను నిర్వహించింది. ఆ తరువాత 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్ళీ ఉత్సవాలను నిర్వహించింది.
గత అయిదేళ్ళపాటు డూండీ గణేష్ నిర్వాహకులను ఉత్పవాలు నిర్వహించకుండా, అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది, ఆ ఏడాది ఎందుకు డూండీ గణేష్ సంస్థ ఉత్సవాలను నిర్వహించలేదో చంద్రబాబు చెప్పాలి. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలో 800 వినాయక మంటపాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. చంద్రబాబు దర్శించుకున్న వినాయక మంటపాన్ని ఏర్పాటు చేసిన సంస్థ వ్యాపారుల నుంచి ఎంత మేర డబ్బులు వసూలు చేసిందో ముందు తెలుసుకుని మాట్లాడాలి.
కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ నగరంలో 40కి పైగా దేవాలయాలను నిర్ధాక్షణ్యంగా కూల్చివేసిన చంద్రబాబు దేవుడి గురించి, ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఆయన కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మించింది సీఎంగా వైయస్ జగన్. తిరుమలలో వెయ్యి కాళ్ళ మంటపాన్ని కూల్చిన ఘనత కూడా చంద్రబాబుదే.
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని ప్రసిద్ద కాణిపాకం గణపతి ఆలయాన్ని అన్ని హంగులతో పునర్ నిర్మించిన చరిత్ర సీఎంగా వైయస్ జగన్‌ది. కాణిపాక వినాయకుడికి సంబంధించి బంగారురథం వైయస్ జగన్ హయాంలోనే సిద్దం చేయించి, స్వామివారికి సమర్పించారు. తిరుపతిలో వకుళమాత ఆలయాన్ని వైయస్ఆర్సీపీ హయాంలోనే పునర్ నిర్మించారు. విజయవాడలోని దుర్గగుడిలో రూ.75 కోట్లు దసరా ఉత్సవాల కోసం ప్రభుత్వం నిధులను సమకూర్చి, ఘనంగా నిర్వహింపచేశారు.
అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూర్తి చేసింది కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే. ప్రకాశం బ్యారేజీ పక్కన చిన్నజీయర్ స్వామివారి మఠానికి కొండను ఇవ్వడం వల్ల విజయకీలాద్రిగా వర్థిల్లుతోంది. గణపతి సచ్చితానంద స్వామీజీకి చెందిన అనంతపురం భూవివాదంను కూడా పరిష్కరించడం వల్ల నేడు అక్కడ చక్కని ఆసుపత్రి నిర్మాణం జరిగి, పెద్ద ఎత్తున ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి.
స్వరూపానంద స్వామీజీకి హిందూధర్మ పరిరక్షణ కోసం విశాఖపట్నంలో భూమి కేటాయిస్తే, దానిని లాక్కుని, ఆయనపై కక్షతో విష ప్రచారం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ఇదే విశాఖపట్నంలో ఊరుపేరు లేని అనేక డొల్ల కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టిన ఘనత చంద్రబాబుది.