Suryaa.co.in

Telangana

సీఎం కప్ – 2023 నిర్వహణ పై లోగో, మస్కట్ & లోగో ఆవిష్కరణ

– రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో SATS చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారితో కలిసి ఆవిష్కరణ

CM కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా సీఎం కప్ – 2023 ను నిర్వహిస్తున్నాం.ఈ CM CUP – 2023 లో 2 లక్షల మంది విద్యార్థులను భాగస్వామ్యం చేసి భవిష్యత్తు క్రీడాకారులుగా తీర్చిదిద్దబోతున్నాం.తెలంగాణ రాష్ట్రం నుండి దేశానికి గొప్ప క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా సీఎం కప్ – 2023 ను పగడ్బందీగా నిర్వహించాలని మంత్రి అధికారకు ఆదేశం.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కప్ క్రీడాకారులకు ప్రామాణికంగా నిలవాలి.గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దేశంలో ఏక్కడ లేని విధంగా సిఎం కప్ ను క్రీడా పోటిలు గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాము. సిఎం కేసిఆర్ అదేశాల మేరకు రాష్ట్రం లో క్రీడల అభివృద్ధికి ప్రతి అసేంబ్లీ నియోజక వర్గంలో నూతనంగా 76 క్రీడా మైదానాల ఏర్పాటు కు అనుమతులను ఇవ్వడం జరిగింది.ఇప్పటికే రాష్ట్రంలో 50 శాతం స్టేడియాలను పూర్తి చేసాము.

సిఎం కెసిఆర్ అదేశాల మేరకు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దాదాపు 19 వేల గ్రామాలు, పట్టణాలలో క్రీడా ప్రాంగణాలను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిర్మిస్తున్నాము.సిఎం కఫ్ క్రీడల నిర్వహాణ కు సిఎం కెసిఆర్ 3 కోట్ల 60 లక్షల రూపాయల ను మంజూరు చేయడం జరిగింది. సీఎం కప్ నిరంతరం కొనసాగేలా విధి విధానాలు రూపొందించాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశం.క్రీడాకారులకు, కోచ్ లకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నాం. గత ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడలలో తెలంగాణకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనపర్చారు.

CM Cup – 2023 విజయవంతం చేయడానికి తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్లు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఉన్నతాధికారులు సీఎం కప్ విజయవంతం చేయడానికి కీలక భూమిక పోషించాలనీ మంత్రి ఆదేశం. సీఎం కప్ – 2023 లో నిర్వహణ లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను హెచ్చరించారు.18 క్రీడాంశాలలో సీఎం కప్ పొందుపరిచామన్నారు. అందులో 15 క్రీడలు ఒలంపిక్ అసోసియేషన్ గుర్తింపు పొందిన క్రీడలు ఉన్నాయన్నారు.

సీఎం కప్ నిర్వహణ లో బాగంగా ఈ నెల 15 నుండి 17 వరకు జరిగే మండల స్థాయిలో, May 22 నుండి 24 వరకు జిల్లా స్థాయిలో, May 28 నుండి 31 వరకు నిర్వహిస్తూన్నామన్నారు.   సీఎం కప్ 2023లో విజయం సాధించే క్రీడాకారులకు టీం ఈవెంట్స్ విజేతలకు ఒక 1,00,000 రూపాయాల నగదు బహుమతి, రన్నర్స్ కి 75 వేల రూపాయలు మూడో స్థానంలో నిలిచిన వారికి 50 వేల రూపాయలను సాట్స్ ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు.

29న జరిగే సీఎం కప్ ఉత్సవాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – క్రీడా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ విజయవంతం చేయడానికి వివిధ కమిటీలను నియమించాలని ఆదేశం. క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ అందిస్తున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆదరించాలని కోరారు. సీఎం కప్ నిరంతరం నిర్వహించేలా క్రీడా శాఖ అధికారులు విధి విధానాల ను రూపొందించాలని మంత్రి ఆదికాలు ఆదేశం.

ఈ కార్యక్రమంలో సాట్స్ ఓ ఎస్ డి డాక్టర్ కే లక్ష్మి, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్, జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సాట్స్ ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, అనురాధ, దీపక్, డాక్టర్ హరికృష్ణ, అర్జున అవార్డు JJ శోభ, ములిని రెడ్డి, అనుప్, క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోచ్ లు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE