Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు వాటిల్లితే సీఎం జగన్ దే బాధ్యత

– తక్షణమే ఆయనను హైదరాబాద్ తరలించాలి
– బాబు అనారోగ్యంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్ ఆందోళన

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలతో ఏపి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది..ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసి అడ్డుతొలగించుకునే కుట్ర చేస్తున్నారు. చేయని నేరానికి జరగని అవినీతికి 34రోజులుగా జైల్లో పెట్టారు.

డీహైడ్రేషన్, దద్దుర్లు, స్కిన్ ఎలర్జీలతో ఆయన బాధపడుతుంటే సీఎం జగన్మోహన రెడ్డి సామర్లకోట సభలో వెటకారం చేయడం అమానవీయం, గర్హనీయం. డీహైడ్రేషన్ గురించి, స్కిన్ ఎలర్జీలపై వారం రోజుల క్రితమే మాజీ సీఎం ఫిర్యాదుచేసినా సరైన చికిత్స అందించకుండా, కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేయడాన్ని ఖండిస్తున్నాం.

వైద్యులిచ్చిన ఎమర్జెన్సీ మెడికల్ రిపోర్ట్ క్షీణించిన ఆరోగ్యానికి సాక్ష్యం.. తక్షణమే ఆయనను హైదరాబాద్ తరలించాలి, వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో నిపుణులైన వైద్యుల ద్వారా అత్యున్నత వైద్యం ఎమర్జెన్సీ ప్రాతిపదికన అందించాలి. చంద్రబాబు ప్రాణాలకెటువంటి ముప్పు వాటిల్లినా సీఎం జగన్మోహన రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

LEAVE A RESPONSE