Suryaa.co.in

Andhra Pradesh National

హోంమంత్రి అమిత్‌షాతో సీఎం భేటీ

ముగిసిన ఢిల్లీ పర్యటన

న్యూఢిల్లీ:ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైయస్‌.జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. సౌత్‌జోనల్‌ కమిటీ సమావేశంలో భాగంగా ప్రస్తావించిన విభజన సమస్యలు – వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల అంశంకూడా ప్రస్తావనకు వచ్చింది.

రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ ఆస్తుల పంపకం సహా విభజన సమస్యలన్నీ కూడా పెండింగులో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం మరోమారు హోంమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీంతోపాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపైనకూడా సీఎం, హోంమంత్రితో చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం వైయస్‌.జగన్‌ తిరిగి తాడేపల్లి చేరుకున్నారు.

LEAVE A RESPONSE