తునిలో తన పర్యటన సందర్భంగా జనాల మధ్య కుమారుడితో ఉన్న తల్లి తనూజను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గుర్తించి.. వెంటనే తన కాన్వాయ్ ఆపి దిగి తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజ ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అనారోగ్య సమస్యను వివరించి ఆదుకోవాలని కోరింది. ఆ తల్లి తనూజ బాధను చూసి చలించిపోయిన సీఎం.. అప్పటికప్పుడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్కు సమస్యను పరిష్కరించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లాను పిలిచి తల్లికి తక్షణం 10 వేల రూపాయల ఆర్థిక
సహాయం అందించి, వచ్చే నెల నుండి బాలుడు ధర్మతేజకు వికలాంగ పింఛను అందేలా చూడాలని సూచించారు. పిలిచి సహాయం అందించి, తన కష్టాలను తొలగించిన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మంచి మనసుకు తల్లి నక్కా తనూజ పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందాశ్రువులతో ఆయనకు వందనాలు చేసింది.<a href=”https://ibb.co/tYTsSw3″></a>
<a href=”https://ibb.co/1XQK93z”></a>
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన ముగిసిన వెంటనే రెండు గంటలలోపే జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా… తల్లి తనూజ, బాలుడు ధర్మతేజలను కాకినాడ కలెక్టరేటుకు రావలసిందిగా సూచించి, డిఆర్డిఏ పిడి కె. శ్రీరమణితో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయించారు. గురువారం మద్యాహ్నం కలెక్టరేట్ లోని తన ఛాంబరులో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 10 వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం బాలుడి తల్లికి
అందించారు. అలాగే బాలుడికి వచ్చే నెల నుండి వికలాంగ పించను మంజూరు జారీ చేసారు. బాలుడి నూరు శాతం వైకల్యం దృష్ట్యా అతడికి 35 వేల రూపాయల విలువైన వీల్ చైర్ ఇప్పించారు.