Suryaa.co.in

Andhra Pradesh

సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్పిన సీఎం జగన్

-డా. అంబేడ్కర్ కన్న కలలకు అనుగుణంగానే ఏపీలో సామాజిక న్యాయం
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి
– సంక్షేమ కార్యక్రమాలకు రోల్ మోడల్ జగన్ 
– మోపిదేవి వెంకట రమణ

రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ..
అశేష ప్రజాదరణ కలిగిన నాయకుడుగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్ల ప్రజా పాలనలో ముఖ్యంగా, రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా, భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ జరగని విధంగా పరిపాలన కొనసాగిస్తూ పూజ్య బాపూజీ, డా. బీఆర్‌ అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం అనే పదానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు సంపూర్థ అర్థాన్ని తీసుకువచ్చారు.

– అంబేద్కర్‌ కన్నకలలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలు అవుతున్నాయి. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలంటే వారి అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌తో ఆర్థిక వ్యవస్థ అంతా ఛిన్నాభిన్నం అయినా, ఎ‍క్కడా వెనకడుగు వేయకుండా, పేదవాడికి సాయం చేయడానికి ఆర్థిక వ్యవస్థలు సహకరించాల్సిన అవసరం లేదని, మనసు ఉంటే మార్గం ఉంటుందనే తనదైన ఆలోచనతో పరిపాలన చేస్తున్న గొప్ప నాయకుడు జగన్ గారు.

– ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రిగారు పాలన చేస్తున్నారు. గత ప్రభుత్వాలు దళితులను, బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తే… వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారం చేపట్టాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్నిరంగాల్లో సముచిత స్థానం కల్పించారు. సమాజంలోని అణగారిన వర్గాల్లో మార్పు తీసుకువచ్చి వారికి గౌరవంతో పాటు, ఆర్థికంగా, రాజకీయ స్వావలంభన కల్పించి, వారి ఉన్నతికి దశ, దిశ కల్పించేలా ముఖ్యమంత్రిగారు వ్యవస్థలన్నింటిలో మార్పును తీసుకువస్తున్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఆధునిక పరిపాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టడమే కాకుండా, సంక్షేమ కార్యక్రమాలకు రోల్‌ మోడల్‌గా నిలిచారు.

– రాష్ట్రంలో ముఖ్యమంత్రిగారు అమలు చేస్తున్న పరిపాలనా విధానాలు, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అందుకు ఉదాహరణే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మంచి స్పందనను చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ గారి నాయకత్వంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని ప్రతి పేదవాడు భావిస్తున్నాడు. ప్రజలంతా జగన్‌ గారి నాయకత్వం కొనసాగాలని ఆశిస్తున్నారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సామాజిక న్యాయం భారతదేశంలో మరే రాష్ట్రంలో జరగటం లేదు. బడుగు, బలహీన వర్గాలకు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినన్ని రాజకీయ పదవులు బలహీనవర్గాల ముఖ్యమంత్రులు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వలేదు.
– ప్రతి ఒక్కరూ, జగన్  పరిపాలనకు ముందు సామాజిక న్యాయం ఎలా ఉంది.. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందన్నది బేరీజు వేసుకుంటున్నారు.

– కోనసీమకు అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు మొదట డిమాండ్ చేసి,ఆ తర్వాత ప్రజలందరి కోరిక మేరకు అంబేడ్కర్ గారి పేరు పెడితే, ఒక దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్ళ మీద దాడులు చేసి, తగలబెట్టి, హింసకు పాల్పడినా కనీసం టీడీపీ, జనసేనలు ఖండించలేదంటే, ఆ వర్గాల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది.

– సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఒక బూటకం, ఎన్నికల నినాదం మాత్రమే. ఈ పార్టీలను దళిత, బలహీన వర్గాల వాడల్లోకి కూడా రానివ్వరు. గ్రామ సచివాలయ వ్యవస్థ, నూతన జిల్లాలు ఏర్పాటు, మరెన్నో సంక్షేమ పథకాల ద్వారా జగన్ గారు రాష్ట్రంలో గొప్ప పరిపాలన అందిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రజా పాలనకు మూడేళ్ళు పూర్తయ్యాయని, అయితే, ప్రభుత్వంపై రాక్షస మూకలు, ఎల్లో మూకలు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. వీరితో రాబోయే రెండేళ్ళు కూడా యుద్ధం చేయాలి అన్నారు. టీడీపీతోపాటు ఎల్లో మీడియా రాక్షసులపై మనం యుద్ధం చేస్తున్నాం అన్నది కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి  మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీలు  కల్పలతా రెడ్డి, వంశీ కృష్ణ, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్  పూనూరు గౌతమ్ రెడ్డి, ఆప్కో ఛైర్మెన్  చిల్లపల్లి మోహన్ రావు, ఎస్సీ మాల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పి. అమ్మాజీ, పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ తదిత ముఖ్య నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE