-నేడు 11 బీసీ కుల సంఘాలకు మంత్రుల చేతుల మీదుగా పట్టాలు
-ఏక సంఘంగా ఏర్పడ్డ కులాలకు భవన నిర్మాణ అనుమతులు
-ప్రతీ ఆత్మగౌరవ భవనంలో ఆయా కులాల్లోని ప్రతీ వ్యక్తికి భాగస్వామ్యం
-గతంలో పట్టాలు అందుకున్న 24 కుల సంఘాలు
-75ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో బీసీలను గుర్తించింది కేవలం కేసీఆరే
-41 కులాలకు కోకాపేట, ఉప్పల్ బగాయత్లో 87.3 ఎకరాలు, 95.25 కోట్లు
-హాస్టళ్లు, వసతి గ్రుహాలు, పంక్షన్ హాళ్లు, ఉపాది శిక్షణ కేంద్రాలు నిర్మించుకోవాలి
-310 గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్పులు, కళ్యాణలక్ష్మీ సహా ప్రతీ పథకంలో బీసీలదే మెజర్ వాటా
-సీఎం రాష్ట్రంలో సంపద పెంచుతున్నారు, దాన్ని పేదలకు పంచుతున్నారు
ఎ-న్నికలప్పుడే రాజకీయం, మిగతా సమయంలో అభివృద్ది
-వెనుకబడిన వర్గాలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పదికాలాలు చల్లగా ఉండాలి
-బీసీల పక్షాన కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పిన మంత్రి గంగుల కమలాకర్
75ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని విదంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు సీఎం కేసీఆర్ గారు మేలు చేస్తున్నారని, దాదాపు 8000వేల కోట్ల మార్కెట్ విలువ గల భూమిని బడుగు, బలహీన బీసీ వర్గాలకు కేటాయించారన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు సహచర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలతో కలిసి ఏక సంఘంగా ఏర్పడ్డ 11 కుల సంఘాలకు పట్టాలు ప్రధానం చేసారు, హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రజక, పద్మశాలి, నాయీబ్రాహ్మణ, ముదిరాజ్, వాల్మీకి బోయ, గాండ్ల, బొందిలి, కచి, ఆరేకటిక, భూంజ్వా, మరియు సంచార జాతులకు మంత్రులతో కలిసి పట్టాలు అందజేసారు.. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ నేడు పట్టాలు పొందిన పదకొండు కులాలతో పాటు గతంలో 24 కులాలకు పట్టాలు అందజేసామనీ వీరందరికీ నిధుల్ని సైతం విడుదల చేస్తామని, ఈ 35 కులాలు వచ్చే ఏడాదికల్లా గ్రుహ ప్రవేశాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. మిగతా సంఘాలను సైతం త్వరలోనే ఏకం చేస్తామని లేదంటే ప్రభుత్వమే నిర్మాణం చేస్తుందన్నారు. వీటిలో కులం అవసరాలు తీరేవిదంగా, భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసేలా పంక్షన్ హాల్లు, హాస్టల్లు, వసతి సౌకర్యాలు, విద్యా కోచింగ్ కేంద్రాలు, ఉపాది శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వెనుకబడిన వర్గాలకు సీఎం కేసీఆర్ గారు అత్యంత విలువైన వేలకోట్ల భూమిని 87.3 ఎకరాలు, కొకాపేట, ఉప్పల్ బగాయత్ వంటి ప్రాంతాల్లో 41 కుల సంఘాలకు జనాబా పరంగా ఇవ్వడమే కాకుండా 95 కోట్లను సైతం భవన నిర్మాణానికి ఇచ్చి, వాటిని తమ కులవృత్తులు ప్రతిఫలించేలా డిజైన్ చేసుకొని ఆత్మగౌరవం ఇనుమడించేలా కట్టుకునే అవకాశం కూడా ఏక కుల సంఘం ట్రస్టులకే కల్పించారన్నారు. వీటిలో కూలానికి సంబందించిన ప్రతీ వ్యక్తికి బాగస్వామ్యం ఉంటుందన్నారు. వీటిలో మౌళిక వసతుల్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు వెనుకకు నెట్టేయబడ్డ బీసీ వర్గాలకు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యుత్తమ విద్యను అందించేందుకు 310 గురుకులాలను ఏర్పాటు చేసారని, గతంలో సమావేశాలు నిర్వహించుకోవడానికి కరీంనగర్, వరంగల్ లాంటి చోట్ల నుండి వస్తే హైదరాబాద్లో కనీసం గుంట చోటు లేక విలవిల్లాడుతున్న దుస్థితిని గుర్తించి వేల కోట్ల స్థలాల్ని ఇచ్చారని గుర్తు చేసారు. ఇంతకు ముందున్న ఏ ప్రభుత్వాలు కనీసం గుర్తించలేని పరిస్థితి ఉండేదన్నారు, అందుకే బీసీల మందరం కేసీఆర్ గారికి రుణ పడి ఉన్నామన్నారు మంత్రి గంగుల. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలని మిగతా సమయంలో అభివృద్ది మాత్రమే చేయాలన్నదే తమ అభిమతమన్నారు. దేశంలో ప్రధానితో పాటు ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా తెలంగాణ రాష్ట్రంలో సంపద పెంచుతున్నారని దాన్ని పేదలకు పంచుతున్నారని కొనియాడారు, ఇంత చేస్తున్న కేసీఆర్ గారికి మనమంతా రుణపడి ఉండాలని బీసీల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి గంగుల.
ఈకార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… నేటి కాలపు మహాత్మా జ్యోతీబాపూలే సీఎం కేసీఆర్ గారని అన్నారు, గతంలో పూలే గారు చేసిన అధ్యాయంలో బీసీలంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వృత్తిపరంగా కులాలుగా స్థిరపడ్డారని, అప్పటినుండీ మనల్ని ఏకం కానీయకుండా కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో అవమానాల్ని భరించామని, చరిత్రలో తొలిసారిగా బీసీలను ఏకం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అన్నారు, దేశంలోని బీసీ ముఖ్యమంత్రుల్లో ఎవరూ చేయని విదంగా నేడు 8వేల కోట్ల విలువైన స్థలాల్ని బీసీ ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించారని, వీటిలో నేడు పట్టాలు తీసుకున్న ప్రతీ ఒక్క కులం తమ ఆత్మగౌరవం ప్రతిఫలించేలా భవనాల్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో 19 గురుకులాల నుండి బీసీలకే 310 కేటాయించి మొత్తంగా దాదాపు 1000కి పైగా గురుకులాలను తెలంగాణ ప్రభుత్వం మాత్రమే నిర్వహిస్తుందన్నారు. వేలకోట్ల రూపాయలతో గొల్లకురుమలకు గొర్లు, ముదిరాజ్, గంగపుత్రులకు చేపపిల్లలతో పాటు ప్రతీ కుల వృత్తికి వెన్నుదన్నుగా కేసీఆర్ సర్కార్ నిలుస్తుందన్నారు.
మరో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మన దేశం వ్యవసాయ ఆధారితమైందని, ఆ రంగంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనిక విధానాలతో దూసుకుపోతుందన్నారు, రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ 1 కోటి 45 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో 93 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని వారందరికీ మేలు చేకూరేలా అనేక పథకాల్ని ప్రవేశపెట్టామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా ఉండే వాల్మీకీ బోయ, ముధిరాజ్ కులాలకు ఆత్మగౌరవ భవనం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తంచేసారు, ముఖ్యమంత్రి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారికి, బుర్రా వెంకటేశం గారికి క్రుతజ్ణతలు తెలియజేసారు. 65 లక్షల రైతుబందు తీసుకుంటున్న రైతుల్లో ఎకరాలతో సన్న, చిన్నకారు రైతులే అత్యధికమన్నారు, 90 లక్షల ఎకరాలకు 39 లక్షల బీసీ కుటుంబాలకు రైతు బందును అందజేస్తున్నామన్నారు. ఈ వెనుకబడిన వర్గాలకే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా, ఉచిత కరెంటు ద్వారా లబ్దీ చేకూరుతుందన్నారు. వ్యవసాయ సాగు పెరగడం ద్వారా రాష్ట్రంలో ఉపాది అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో మంచినీటి చేపల ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. వీటి ద్వారా ఆరోగ్య తెలంగాణకు పునాది ఏర్పడిందన్నారు, గత ఎనిమిదేళ్లలో కేంద్రంలో 14 లక్షల కొలువుల్ని నింపని అసమర్థ ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు. ప్రైవేటైజేషన్ వల్ల రిజర్వేషన్లు కొల్పుతున్న విషాదాన్ని గుర్తించాలన్నరు నిరంజన్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విదంగా బీసీ ఆత్మగౌరవ భవనాల్ని కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఏర్పడిన కమిషన్లు బీసీ జనగణన, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయమని చెప్పినా ఇంతవరకూ ఏర్పాటు చేయకపోవడం బీసీల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షే అన్నారు. జనగణనపై మోదీ సర్కార్ చేతులెత్తేసిందని, సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో చాతకాదని చెప్పిందన్నారు. కులవృత్తులకు చేయూత నివ్వడమే కాకుండా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారన్నారు అందుకు నిదర్శనమే ఏ ఫైరవీ లేకుండా ఎంపీ, ఎమ్మెల్సీగా వెనుకబడిన వర్గానికి చెందిన నాకు ప్రాతినిధ్యం అన్నారు ఎమ్మెల్సీ బండా ప్రకాష్.
మరో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ బీసీ మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బీసీ మంత్రి గంగుల, బీసి ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉండడం వల్లే బీసీలకు రాష్ట్రంలో మేలు జరుగుతుందన్నారు, నిజమైన పూలే వారసుడు కేసీఆర్ అని అడగకున్నా కడుపునింపుతారన్నారు, నేడు ఇస్తున్న ఆత్మగౌరవ భవనాలు ఏ ఒక్క సంఘానివో కావని మొత్తం కులానికి చెందినవన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పెద్దపల్లి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, పదకొండు కుల సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.