గవర్నర్ పై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్..

Spread the love

తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ…. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మహిళల పట్ల చాలా గౌరవం ఉంది. గవర్నర్ తన పరిధిని ధాటి వ్యవహరిస్తున్నారు. రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు దూరం ఎక్కడ పెరగలేదు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి. గతంలో ఎంతో మంది గవర్నర్లు రాష్ట్రంలో పనిచేశారు.. వారితో రాని ఇబ్బంది ఈ గవర్నర్ తో ఎందుకు వస్తుంది. ఆరోజు ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయిన ఇంకా ఆమె అధ్యక్షారాలుగానే వ్యవహరిస్తోంది. ఆమెకు కూడా గవర్నర్ పదవీ ఎలా అర్హత ఉంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రతినిధిగా మాట్లాడం సరైంది కాదు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ ఎప్పుడు రావాలి అన్నది ఆయన ఇష్టం. వరదలు వస్తే ప్రభుత్వం ఉండగా మీకేం పని అని వెళ్లారు. తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదు అందుకే విమోచనం అంటుంది. లేని సమస్యలను ఉన్నట్టు చూపడం సమంజసం కాదు. ఆమె ఎం సాధించిందో కూడ చెప్పాల్సింది.ఆమె చేయాల్సింది ఎం చేసిందని ఈ సమావేశం. గవర్నర్ గా ఉంటారో పార్టీ నేతగా వ్యవహరిస్తారో తేల్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ వివరిస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసిస్తే ఇమే మాత్రం ఇలా మాట్లాడం కరెక్ట్ కాదు. గవర్నర్ తన వైఖరి ఇప్పటికైనా మార్చుకోవాలి.

Leave a Reply