-నాటి పోరాట కీర్తి, నిన్నటి ఉద్యమ స్ఫూర్తి… ఉద్యమంగా అభివృద్ధి
-నాటి పోరాటాల త్యాగాల ఫలితమే నేటి బంగారు తెంగాణ
-కెసిఆర్ వల్లే ప్రజలకు అభివృద్ధి ఫలాలు
-పాలకుర్తిని కంటికి రెప్పలా కాపాడుకుంట
-నన్ను గెలిపిస్తున్న పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకుంటా
-పాలకుర్తిని మరింతగా అభివృద్ధి చేస్తా
-తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా -పాలకుర్తిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ
-బతుకమ్మలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ
-ర్యాలీలో ముందుండి నడిచిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-పాలకుర్తి ప్రజల, ప్రాంత అభివృద్ధికి పునరంకితమైతానని -మంత్రి ఎర్రబెల్లి ప్రకటన
ఈ ర్యాలీ, సభ, సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ .. నిజాం పరిపాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ శుభాకాంక్షలు!
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం, ఈ నెల 16 వ తేది నుండి 18 వ తేది వరకు 3 రోజుల పాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నిర్ణయించారు. పోరాట యోధులను స్మరిస్తూ, వారి స్పూర్తితో ప్రగతి ప్రయాణం కొనసాగించాలని యావత్ ప్రజలకు నిర్దేశించారు. ఈ వేడకలను మనం ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రజలందరిలో జాతీయ సమైక్యత భావం పెరిగే విధంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, స్వాతంత్య్ర సమర యోధులను, కవులు, కళాకారులను సన్మానించుకుంటున్నాం.
నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో ఎందరో కవులు, కళాకారులు, రచయితలు తమ కవితలు, రచనల ద్వారా ప్రజలలో చైతన్యం నింపారు. జైలు గోడలపై నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ అని రాసిన దాశరథి, ప్రజాకవి కాళోజీ, సుద్దాల హనుమంతు, బీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, బద్దం నర్సింహారెడ్డి లాంటివారు ఎన్నో ఉద్యమాలు చేశారు. గూడూరుకు చెందిన చౌడవరపు విశ్వనాథం గోడపత్రిక నడిపి ప్రజల్లో చైతన్యం కలిగించారు. గూడూరుకే చెందిన చుక్కా రామయ్య నాడు రజాకార్లను ఎదుర్కొన్నారు.
ఇదే సమయంలో మన పాలకుర్తి గడ్డ బిడ్డ చాకలి ఐలమ్మ భూస్వాములను, నిజాం ను వీరోచితంగా ఎదురించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో కోర్టులో గెలిచింది. ఈ పోరాటంలో మొదటి ప్రాణార్పణ చేసింది మన కడవెండి కి చెందిన దొడ్డి కొమురయ్య. అలాగే ఆనాడు దేశ్‌ముఖ్ ని ఎదురించి కోర్టుకెళ్ళి ప్రాణాలు కోల్పోయిన బందగీ.. కామారెడ్డిగూడెం బిడ్డే. నాటి పోరాటంలో అత్యంత కీలకంగా పని చేసిన నల్లా నర్సింహులు కూడా మన కడవెండి వాడే. మరో జలియన్ వాలా బాగ్… బైరాన్ పల్లి, ఖిలా షా పూర్, కూటిగల్, తొర్రూరు, అమ్మాపూర్ ఒక్కో ఊరు నిజాం నిరంకుశానికి బలైన గ్రామాలే. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల వంటి అనేక గ్రామాలు పోరాటంలో పాల్గొన్నాయి. వేలాది మంది అమరులయ్యారు.
ఈ నేపథ్యంలో భారత ప్రధాని నెహ్రూ, హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు. విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం పోలీస్ చర్యకు దిగింది. దీనినే “ఆపరేషన్ పోలో” అని పిలిచారు.
ఓవైపు సాయుధ పోరాటం..మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమిలేక అప్పటి నిజాం భారత యూనియన్ లో విలీనానికి అంగీకరించాడు. 1948 సెప్టెంబరు 17 సాయంత్రం డెక్కన్ రేడియో లో తన లొంగుబాటును ప్రకటించారు. నిజాం లొంగుబాటు తో హైదరాబాద్ భారత దేశంలో విలీనం అయింది.
అయితే, హైదరాబాద్ సంస్థాన ప్రజల స్వేచ్ఛా వాయువులు ఎక్కువ కాలం నిలవలేదు. అనతి కాలంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణ (హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆంధ్రా పాలకుల చేతుల్లోకి పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో బలవంతంగా వెళ్ళింది. కలిసిన నాటి నుండే 60 ఏండ్లపాటు తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేశారు. 1969నాటి ఉద్యమంలో అనేక మంది అసువులు బాసారు. చివరకు కెసిఆర్ గారి నాయతకత్వంలో 14 ఏండ్ల సుదీర్ఘ శాంతియుత పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా, దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటు అయినది. ఉద్యమ నేతే సిఎం కావడంతో కెసిఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణ గా మారుతున్నది.
నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది 75 ఏండ్లు పురస్కరించుకుని, నాటి అమరుల త్యాగాలు స్మరించుకుంటూ, తెలంగాణ సమైక్య వజ్రోత్సవాలను జరుపుతున్న ఈ సమయంలోనే సబ్బండ వర్గాలకు ప్రభుత్వం సాయంగా ఉంటున్నది. అలాగే తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, హైదరాబాద్ లో కుమరం భీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్ లను ప్రారంభించుకోవడం ఒక శుభ సూచకం.
ఈ సందర్బంగా గిరిజన సోదరీ, సోదరీమణులకు నా హృదయ పూర్వక అభినందనలు!
ఈ తరుణంలో మనమంతా నాటి త్యాగాలను గుర్తు చేసుకుందాం. నేటి ఈ స్వేచ్చ, స్వాతంత్య్రాలు వారి బలిదానాల ఫలితమే. తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది కూడా నాటి పోరాటమే. అదే ఉద్యమ స్పూర్తితో మరింత అభివృద్ది వైపు గా అడుగులు వేద్దాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! మన చరిత్రను మనం స్మరించుకునే అవకాశం కల్పించిన సిఎం కెసిఆర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తెలంగాణ విలీనాన్ని సమైక్యతకు ప్రతీకగా నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆలోచించారు.దాన్ని ఒక విద్రోహ దినంగా, విధ్వంసానికి వేదిక చేసుకోవాలని బిజెపి చూసింది. కలిసి మెలిసి జీవిస్తున్న హిందూ ముస్లీం ప్రజల మధ్య మత చిచ్చు పెట్టాలని కుట్ర పన్నింది.
బిజెపి కుతంత్రాలను తిప్పి కొట్టి, సిఎం కెసిఆర్… దేశవ్యాప్తంగా ఐక్యతను పెంచే విధంగా, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇది సిఎం దూర దృష్టికి, జాతీయతా భావానికి నిదర్శనంఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో వివిధ శాఖల వారీగా జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని ఒకసారి గుర్తు చేసుకుందాం
వ్యవసాయం:
ఉమ్మడి రాష్ట్రంలో దండుగలా ఉన్న వ్యవసాయాన్ని కెసిఆర్ పండుగలా చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో, ఎస్సారెస్సీ కాలువలతో, దేవాదుల ప్రాజెక్టు మరియు మిషన్ కాకతీయతో సాగునీరు వచ్చిందిఇప్పుడు మన చెరువులు నిండు కుండలెక్క ఉన్నయివద్దంటే నీళ్ళు, వద్దంటే 24 గంటల ఉచిత కరెంటు వస్తున్నదికేంద్రం ఎన్ని కుట్రలు చేసినా, తన బొండిగల పానం ఉన్నంత వరకు మోటర్లకు మీటర్లు బిగిచ్చేది లేదన్నడు
మిషన్ కాకతీయ
ఉమ్మడి పాలనలో చెరువులు నిర్లక్ష్యానికి గురైనయి.గంగాళంలా ఉండే చెరువులు తాంబాళంలా మారినయి.నీరు నిలిచేది లేదు.. పంటలు పండేది లేదు. కరువే కరువు.తెలంగాణ వచ్చినంక సిఎం కెసిఆర్ గారు బాగా ఆలోచించి మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసిండ్రు. చెరువుల పూడిక తీత తీయించిండు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, ఆ నీటితో చెరువులను నింపుతుండు.
ఇప్పుడు చెరువులు ఎండాకాలంలో చూసినా నిండు కుండలా నీటితో నిగనిగలాడుతున్నయి.మిషన్ కాకతీయ ద్వారాః 89కోట్ల 15 లక్షల రూపాయలతో 331 చెరువులు బాగు చేసి 25వేల 598 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నం.ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా: 99 కోట్ల తో 80కి.మీ. కాలువలు నిర్మించి, 27వేల 150 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నం.దేవాదుల ద్వారా: 352 కోట్ల 15లక్షలతో 360కి.మీ. కాలువలు నిర్మించి 77వేల 67 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నం.
రిజర్వాయర్లు:
పాలకుర్తి రిజర్వాయర్ః 66 కోట్ల 70 లక్షల రూపాయలతో 7వేల 515 ఎకరాలకు సాగునీరు.
చెన్నూరు రిజర్వాయర్ః 96 కోట్ల 14 లక్షల రూపాయలతో 11వేల 888 ఎకరాలకు సాగునీరు.
నష్కల్ / ఉప్పుగల్ రిజర్వాయర్ః 198 కోట్ల రూపాయలతో 25 వేల 652 ఎకరాలకు సాగునీరు.
తెలంగాణ రాక ముందు పాలకుర్తి నియోజకవర్గంలో చెరువులు, ప్రాజెక్టుల ద్వారా వేలం 54వేల 827 ఎకరాలు మాత్రమే సాగులో ఉండేది.కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత పాలకుర్తి నియోజకవర్గంలో 1లక్షా 31వేల 994 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం.
అంటే…అదనంగా 74వేల 988 ఎకరాలను సాగులోకి తీసుకరావడం జరిగింది.
రైతు బంధు: 88వేల 363 మందికి ఇప్పటి వరకు 795కోట్ల 76 లక్షలు ఇవ్వనైనది.
రైతు బీమా: 1 వెయ్యి 27 మందికి ఇప్పటి వరకు 51 కోట్ల 35 లక్షలు ఇవ్వనైనది.
రైతు వేదికలుః 29 రైతు వేదికలను 6 కోట్ల 38 లక్షలతో నిర్మించినాము.
జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా రుణాలు: 16వేల 537 మంది రైతులకి 14కోట్ల 67లక్షల రూపాయలు.
ధాన్యం కొనుగోలు
కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా వడ్లు, బియ్యం కొనలేదు.
కానీ, మన రైతు బాంధవుడు కెసిఆర్ ఏడాదికి 30వేల కోట్లు భరించి ధాన్యం కొనుగోలు చేస్తున్నాడు.
పాలకుర్తి నియోజకవర్గంలో 8 లక్షల 55 వేల 941 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాము.
మిషన్ భగీరథ :
గతంలో…మహిళలు బిందెలు పట్టుకుని రోడ్లమీదకు పోయేది.
నీటి కోసం కిలోమీటర్ల దూరం పోయే వాళ్ళు.
వ్యవసాయ బావులు, చేద బాయిలు, బోరింగుల దగ్గర సిగపట్లు పట్టుకునేది.
ఇదంతా అగౌరవంగా ఉండేది. అవమానంగా ఉండేది.
కెసిఆర్ అపర భగీరథునిగా నీళ్ళిస్తు్న్నారు.
ఇంటింటికీ నల్లాల ద్వారా రాష్ట్రం మొత్తం నీరిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ.
409 కోట్ల 99 లక్షల రూపాయల ఖర్చుతో…
1వెయ్యి 92 కి.మీ. పైపు లైన్, 448 కొత్త ట్యాంకులు నిర్మించి, 442 ఆవాసాలలోని 61 వేయి 767 గృహాలకు శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తున్నాం.
ఆసరా పెన్షన్లు:
వృద్ధుల, వికలాంగుల ఆత్మగౌరవానికి, జీవన భద్రత కోసం ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం.
గతంలో 75 రూపాయలిచ్చే పెన్షన్లను కెసిఆర్ 2016, 3016కు పెంచిండు.
ఒంటరి మహిళలు, బీడీ, నేత, గీత కార్మికులకు కూడా ఇస్తున్నరు.
ఎయిడ్స్, బోదకాలు, డయాలిసిస్ పేషంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్న మానవతావాది కెసిఆర్.
45వేల 531 మందికి నెలకు 10 కోట్ల 92లక్షల 74వేల రూపాయలు అందిస్తున్నం.
ఏడాదికి 131 కోట్ల 12 లక్షల 88 వేలు ఇస్తున్నాం.
అలాగే, 65 నుండి 57 ఏండ్లకు వయో పరిమితి తగ్గించి కొత్తగా 4వేల 542 మందికి నెలకు 91 లక్షల 56వేలు అందించడం జరుగుతుంది.
కళ్యాణ లక్ష్మీ/ షాదీ ముబారక్:
గతంలో ఈ పథకమే లేదు.
ఇప్పుడు కెసిఆర్ పేదింటికి పెద్దన్న అయిండు.
పెళ్ళిళ్ళు చుసుకునే వాళ్ళకి మేన మామ అయిండు.
ఇప్పటి వరకు 9వేల 162 మందికి 87 కోట్ల 1 లక్ష రూపాయలు అందించాం.
మహిళల అభివృద్ధికి రుణాలు:
ఎన్టీఆర్ డ్వాక్రా సంఘాలు పెడితే, వాటిని బాగా ప్రోత్సహిస్తున్నది మన సీఎం కెసిఆర్.
మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి సాయం చేస్తున్నారు.
మహిళ బాగుంటే…ఆ ఇల్లు, కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుపడతది.
బ్యాంకు లింకేజీ ద్వారా: 3వేల 87 సంఘాలలోని 28వేల 388 మంది మహిళలకు 471 కోట్ల 42 లక్షల రూపాయలు అందించాం.
వడ్డీలేని రుణాలుః 5వేల 634 సంఘాలలోని 33వేల 512 మంది మహిళలకు 17 కోట్ల 14 లక్షల రూపాయలు అందించాం.స్త్రీ నిధి ద్వారా: 3వేల 507 సంఘాలలోని 21వేల 795 మంది మహిళలకు 214 కోట్ల 39 లక్షల రూపాయలు అందించాం.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు:
యూనిట్లు నెలకొల్పుటకు 309 మంది డ్వాక్రా మహిళలకు 5 కోట్ల 51 లక్షల రూపాయలు అందించాం.
పంచాయతీరాజ్/గ్రామీణాభివృద్ధి:
నియోజకవర్గంలో 56 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను 11 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నాం.
సిఆర్ఆర్ రోడ్లు: 168 కోట్ల 53 లక్షలతో 280 కి.మీ. పొడవైన రోడ్ల పనులు పూర్తి చేయడం జరుగుతుంది.
ఎం.ఆర్.ఆర్. రోడ్లు: 73 కోట్ల 71 లక్షలతో 149 కి.మీ. పొడవైన రోడ్ల పనులు పూర్తి చేయడం జరుగుతుంది.
పిఎంజిఎస్‌వై రోడ్లు: 143 కోట్ల 24 లక్షలతో 181 కి.మీ. పొడవైన రోడ్ల పనులు పూర్తి చేయడం జరిగింది.
ఎస్‌డిఎఫ్ రోడ్లు: 8 కోట్ల 65లక్షలతో తండాలకు రోడ్లు వేయడం జరిగింది
చెక్ డ్యాంలు:
108 కోట్ల 11లక్షలతో 27 చెక్ డ్యాం లు పూర్తి చేయడం జరిగింది.
ఇజిఎస్: 204 కోట్ల 90 లక్షలతో సిసి రోడ్లు, డ్రెయిన్లు, మెటల్ రోడ్లు పూర్తి చేశాం.
ఉపాధి హామీ పథకం (ఇ.జి.ఎస్):
హరిత హారం: నియోజకవర్గంలో 52 లక్షల 19 వేల మొక్కలు నాటాం
నర్సరీలుః 177 నర్సరీలను ఏర్పాటు చేశాం.
డంపింగ్ యార్డులుః 4 కోట్ల 78 లక్షలతో అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు నిర్మించాం
వైకుంఠ ధామాలుః 20కోట్ల 3 లక్షలతో అన్ని (177) గ్రామ పంచాయతీలలో నిర్మించాం.
పల్లె ప్రకృతి వనాలు: 15 కోట్ల 27 లక్షలతో 320 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం.
బృహత్ పల్లె ప్రకృతి వనాలు: 4 కోట్ల 11 లక్షలతో 19 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం.
క్రీడా ప్రాంగణాలు: 2 కోట్ల 11 లక్షలతో 160 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం.
కూలీలకు వేతనాలు మరియు మెటీరియల్:
ఇప్పటి వరకు ఈ ఏడాది 49వేల 894 మంది కూలీలకు ఉపాధి కల్పించినాం, 79 కోట్ల 15 లక్షల రూపాయలు చెల్లించాం.
వైద్య ఆరోగ్యం:
3 కోట్ల 20 లక్షలతో కొత్తగా 20 సబ్ సెంటర్ల భవనాలను నిర్మించడం జరుగుతుంది
4వేల 910 మంది లబ్ధిదారులకు 5 కోట్ల 89 లక్షల 20 వేల రూపాయల విలువ గల కెసిఆర్ కిట్లు అందించడం జరిగింది.
మన ఊరు మన బడి :
38 కోట్ల 5 లక్షలతో 104 పాఠశాలలను అభివృద్ధి చేసుకుంటున్నాం
డబుల్ బెడ్ రూం ఇండ్లు:
229 కోట్ల 87 లక్షల రూపాయలతో 4వేల 561 డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు పూర్తి చేయడం జరగుతుంది.
రోడ్లు భవనాలు (ఆర్&బి):
15 కోట్ల 90 లక్షలతో 6 బ్రిడ్జీలు, నిర్మించుకుంటున్నాం
270 కోట్ల 3 లక్షలతో 352 కి.మీ. పొడవైన రోడ్ల పనులు పూర్తి చేయడం జరుగుతుంది
టూరిజం:
37 కోట్లతో బమ్మెర, పాలకుర్తి, వల్మీడి టూరిజం కారిడార్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం జరిగింది.
వెంకటేశ్వరపల్లికి 10 కోట్లు
10 కోట్ల రూపాయలతో సన్నూరు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం
తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి:
తొర్రూరును మున్సిపాలిటీగా చేసుకుని కొద్ది రోజుల్లోనే 95 కోట్ల 87లక్షల 9వేలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది.
సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, సిగ్నల్ వ్యవస్థ, కొత్త డివైడర్లు, ఇంటగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, ట్యాంకుబండ్, యతిరాజారావు పార్క్, స్మశానవాటికలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, అనేక విధాలుగా అభివృద్ధి జరుగుతున్నది.
పాలకుర్తి అభివృద్ధి:
గ్రామంలో రోడ్లు, రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, దేవాలయ అభివృద్ధి, పర్యాటక కేంద్రంగా పాలకుర్తి అభివృద్ధి చెందుతున్నది
ఇప్పటికే 21కోట్ల 24లక్షల రూపాయలతో పాలకుర్తి జంక్షన్ అభివృద్ధి, బై పాస్ రోడ్డు పూర్తైంది
19 కోట్ల 64లక్షల రూపాయలతో 132/33 సబ్ స్టేషన్ నిర్మాణం
కొత్తగా పాలకుర్తికి ఫైర్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది.
త్వరలోనే పాలకుర్తికి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు రానున్నాయి.
పర్యాటకంగా అభివృద్ధి:
13 కోట్ల 50 లక్షల రూపాయలతో శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నాము.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని మనమంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగ స్వాములమవుదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం. మన పాలకుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. మన అభివృద్ధికి అండగా ఉన్న సిఎం కెసిఆర్, కెటిఆర్ గారలకు మనం కూడా అండగా ఉందాం.