Suryaa.co.in

Andhra Pradesh

5 నెలల బాలుడికి రూ.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్

– బాలుడి తల్లి తండ్రులకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే బండారు

కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెధిరేశ్వరం మూలగూడెం కాలనీకి చెందిన ఇళ్ల వెంకటేశ్వరావు, నాగలక్ష్మి దంపతుల 5నెలల కుమారుడు అఖిల్ లివర్ కు సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుచుండగా, బాలుడుకు అందించే వైద్యం అతి ఖరీదు అవడంతో స్థానిక నాయకులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దృష్టికి తీసుకుని వెళ్లడంతో తక్షణం స్పందించిన అయన సీఎం రిలీఫ్ ఫండ్కు సిఫార్సు చేయగా ఆ బాలుడికి వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వెధిరేశ్వరంలోని అఖిల్ తల్లిదండ్రులకు అందజేశారు. తమ కుమారుడుకి ఖరీదైన వైద్యానికి ఎమ్మెల్యే బండారు చేసిన సాయం ఎప్పటికీ మరువలేవని అఖిల్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్యే వెంట బొక్క దుర్గ ప్రసాద్,చిట్టూరి శ్రీను, కుదుపూడి ఏడుకొండలు, రాయుడు సత్యనారాయణ, మట్టపర్తి సత్యనారాయణ,మట్టపర్తి చంద్రరావు, కుడుపూడి వెంకటరమణ మరియు తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE