Suryaa.co.in

Andhra Pradesh

పిల్లల చదువులే ఆ కుటుంబానికి ఆస్తీ

-కృష్ణలంక కళాశాలలో బ్యాగ్లు, పుస్తకాలు పంపిణీ చేసిన గద్దె రామమోహన్

పిల్లల చదువులే ఆ కుటుంబానికి ఆస్తీ అని అలాంటి నాణ్యమైన చదువును తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులందరికి అందిస్తుందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియక్ కళాశాలలో చదువుతకున్న విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరైన విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను, బ్యాగులను ప్రభుత్వం ఉచితంగా అందచేసిందన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు కూడా పుస్తకాలు ఉచితంగా ఇవ్వాల్సిందిగా తాము కోరామని, అందుకు ముఖ్యమంత్రి స్పందించి కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు టెక్స్, నోట్ పుస్తకాలు ఇస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కళాశాల స్థాయి విద్యను నిర్లక్ష్యం చేశారన్నారు.

పీజీ విద్యార్థులు కళాశాలలో చేరే సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఉందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెప్పిందని, విద్యార్థులు కళాశాలలో చేరిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ లేదని చెప్పారని, దాంతో ఎంతో మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువును మధ్యలోనే ఆపివేశారన్నారు. ఇంటర్ కళాశాల స్థాయిలో మధ్యాహ్న భోజనాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని కూడా కళాశాలల్లో తీసివేశారని చెప్పారు.

మళ్ళీ ఆ పథకాలను పునరుద్దరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరామని, ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశీస్తున్నామన్నారు. ఈ కళాశాలకు అతి సమీపంలోనే అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్నామని చెప్పారు. టీఫిన్ రూ.5, భోజనం రూ.5లకే అన్నా క్యాంటీన్లో లభిస్తాయన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థుల కోసం మధ్యాహ్నా భోజనం అమలు చేయడం లేదా అన్నా క్యాంటీన్ నుంచి నేరుగా విద్యార్థులకు అందించే విధంగా చూస్తానని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోగలరని అన్నారు. అలాంటి ఉన్నత విద్యను ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, వేములపల్లి రంగారావు, గొరిపర్తి నాగేశ్వరరావు, ప్రిన్సిఫాల్ పెద్దపూడి రవికుమార్, డి.ఇ.ఓ రెడ్డి, దమ్మాపాటి రంగారావు, కొవ్వూరి కిరణ్బాబు, కేశనం భావన్నారాయణ, కొర్రా అప్పన్న, పుప్పాల సుబ్బారావు, వెన్నా శంకర్, రాజమహంతి రమాదేవి, గోగుల రమేష్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE