విశాఖ రాజధాని అంటూ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడు

– సీమ బిడ్డ నని చెప్పుకునే జగన్ రెడ్డి రాయలసీమకు తీరని అన్యాయంచేశాడు
– తనకు అత్యధిక స్థానాలు కట్టబెట్టిన ప్రాంతరైతాంగానికి, జగన్ రెడ్డి కన్నీళ్లు, కడగండ్లే మిగిల్చాడు.
• రాయలసీమను దోచుకోవడమే తనధ్యేయమన్నట్లుగా జగన్ రెడ్డి తీరుంది.
• లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో తండ్రి కారుచౌకగా రైతులనుంచి కొట్టేసినభూముల్ని జగన్ రెడ్డి తనమేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బంధువులకు కట్టబెట్టడానికి సిద్ధమయ్యాడు.
• రూ.8వేలకోట్ల పైచిలుకు విలువైన భూముల్ని కేవలం రూ.500కోట్లకే కొట్టేసేలా పథక రచనచేశాడు.
• రాయలసీమలో చెరువులన్నీ నిండినా, రైతులు పంటలు ఎందుకు వేయడంలేదని జగన్ రెడ్డి ఏనాడైనా ఆలోచించాడా?
• టీడీపీ హయాంలో సీమరైతాంగానికి అందిన డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లు, ఇన్ పుట్ సబ్సిడీ, రైతురథం, వ్యవసాయయాంత్రీకరణ పనిముట్ల పంపిణీని జగన్ రెడ్డి పూర్తిగా అటకెక్కించాడు.
– మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప

సీమబిడ్డనని చెప్పుకునే జగన్ రెడ్డి, తనప్రాంతానికే తీరని అన్యాయంచేశాడని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ రైతాంగానికి కష్టాలు,కన్నీళ్లు, కడగండ్లే మిగిలాయని, చంద్రబాబునాయుడి హాయాంలో సీమ రైతాంగానికి కలిగిన ప్రయోజనాలన్నీ జగన్ రాగానే నిలిచిపోయాయని టీడీపీ సీనియర్ నేత, మాజీఎంపీ నిమ్మల కిష్టప్ప స్పష్టంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలోవిలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“జగన్ రెడ్డికి చేతనైంది జేబునింపుకోవడం.. ప్రతిపక్షాలు, ప్రజల్ని వేధింపులకు గురిచేయడ మే. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం రాయలసీమకు తీరని అన్యాయంచేస్తోంది.కరువుప్రాంతమైన సీమను దోచుకోవాలన్నదే తమధ్యేయమన్నట్లుగా రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో గతంలో రాజశేఖర్ రెడ్డి బలవంతంగా రైతులనుంచి భూములు లాక్కున్నారు. భూములు తీసుకున్నాక అక్కడ ఒక్కపరిశ్రమపెట్టిందీ లేదు…ఒక్కఉద్యోగం ఇచ్చింది లేదు. కేవలం భూములు కాజేయడానికే పరిశ్రమ పేరుతో రైతులను భయపెట్టి, కారుచౌకగా వాటిని కాజేశారు.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతోసేకరించిన భూముల్ని బ్యాంకుల్లోతనఖాపెట్టి రూ.4,530కోట్లవరకు రుణంకూడా తీసుకున్నారు. తనతండ్రి హయాంలో ఏర్పాటుచేయాలనుకున్న ప్రాజెక్ట్ ని, తాను అధికారం లోకి వచ్చిన వెంటనే పూర్తిచేస్తానని జగన్ రెడ్డి పాదయాత్రలో ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడేమో లేపాక్షినాలెడ్జ్ హబ్ కింద ఉన్న భూముల్ని కాజేయడానికి తన బినామీలతో సిద్ధమయ్యాడు. జగన్ రెడ్డి మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి బంధువులకు చెందిన హరిత ఫర్టిలైజర్స్ కంపెనీపేరుతో భూములు కొట్టేయడానికి రెడీ అయ్యారు. దాదాపు రూ.8వేలకోట్ల విలువచేసే భూముల్ని కేవలం రూ.500కోట్లకే రవీంద్రనాథ్ రెడ్డి బంధువు రామాంజనేయరెడ్డి కంపెనీకి అప్పచెప్పాలని చూస్తున్నారు.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో రైతులనుంచి బలవంతంగా భూమిని తీసుకున్నారు. అదే భూమిని బ్యాంకుల్లో తనఖాపెట్టి రూ.4,530కోట్లవరకు రుణం పొంది, బ్యాంకులకు టోకరా వేశారు. మరలా అదే భూమిపై బ్యాంకుల్లో దివాలాపిటిషన్ వేసి, తన మేనమామ బంధువులకు కట్టబెట్టాలని జగన్ చూస్తున్నారు. ఒకే భూమిని ఇన్నిరకాలుగా చేతులుమార్చి, దాన్ని కొట్టేయాలన్నదే ముఖ్యమంత్రి ఆరాటం. జగన్ రెడ్డి ఇప్పటికైనా తనమాటకు కట్టుబడి రైతులనుంచి సేకరించిన భూముల్లో పరిశ్రమ ఏర్పాటుచేయాలి. లేదంటే వాటిని రైతులకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం.

టీడీపీప్రభుత్వంలో రాయలసీమ రైతాంగానికి అందినసాయం, పథకాలు, ప్రయోజనాలన్ని జగన్ రాగానే నిలిచిపోయాయి. రాయలసీమతోపాటు అనంతపురం జిల్లాలో కరువుసర్వసాధారణం. అలాంటి జిల్లాలోని రైతాంగాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో గతంలో చంద్రబాబుగారు ఇన్ పుట్ సబ్సిడీకింద పంట నష్టపరిహారంఇచ్చారు. టీడీపీప్రభుత్వంలో గత ఐదేళ్లకాలానికి రూ.3,759కోట్ల పరిహారం అనంతపురం రైతులకు ఇచ్చారు. జగన్ రెడ్డి అధికారంలోకివచ్చాక ఈ మూడున్నరేళ్లలో అనంతపురంజిల్లాలో ఎన్నడూలేనివిధంగా పంటనష్టం జరిగితే, కేవలం రూ.1038కోట్ల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. పంటలబీమా పరిహారం టీడీపీప్రభుత్వంలో రూ.4,700కోట్లవరకు వస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం రూ.1800కోట్లు మాత్రమే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అత్యధిక సీట్లు రాయలసీమప్రాంతంనుంచే వచ్చాయి. కానీ ఆప్రాంతంపై మాత్రం ఆయనకు ఎనలేనిచిన్నచూపు. చిన్నచూపు కాబట్టే, సీమప్రాంతానికి టీడీపీప్రభుత్వంలో అందిన పథకాలన్నింటినీ నిలిపేశాడు.

ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా, డ్రిప్ పరికరాలు, రైతురథం ట్రాక్టర్లు, స్ప్రింక్లర్లు, బోర్లువేయడంలాంటివన్నీ నిలిపేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సీమలోని చెరువుల్లో నీళ్లున్నా, పంటలు ఎందుకు పండటంలేదో, అక్కడున్న సమస్యేమిటో ఆయన ఏనాడైనా ఆలోచించాడా? సీమప్రాంతరైతాంగానికి గిట్టుబాటుధర లభించడంలేదు, పండిన పంటలు కొనేనాథుడు లేడు. పంటఉత్పత్తులు నిల్వచేసినా కొనడానికి ఎవరురావడంలేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఏనాడైనా జగన్ రెడ్డి ఆలోచించాడా? వ్యవసాయం సీమప్రాంతంలో గిట్టుబాటు కావడంలేదని గ్రహించే చంద్రబాబుగారు గతంలో ఆప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావడానికి సంకల్పించారు. ఆక్రమంలో పెద్దఎత్తున పారిశ్రామిక రాయితీ లిచ్చారు. కియాపరిశ్రమ తీసుకొచ్చి వేలాదిమందికి ఉపాధికల్పించారు. అదే కియాపరిశ్రమలో డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తికి రూ.20వేల జీతంవస్తుంటే, జగన్ రెడ్డేమో తాను నియమించిన వాలంటీర్లకు రూ.5వేలు ఇస్తూ, గొప్పలు చెప్పుకుంటున్నాడు.

జగన్ రెడ్డి ఇచ్చే రూ.5వేలతో వాలంటీర్లు, వారి కుటుంబాలు ఎలా బతుకుతాయి? కేవలం తనరాజకీయపబ్బం గడుపుకోవడానికే జగన్ వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటున్నాడు. చంద్రబాబు తీసుకొచ్చిన కియాపరిశ్రమ వల్ల జగన్ ప్రభుత్వానికి రూ.6వేలకోట్లు పన్నులరూపంలో వచ్చాయి. అదీ చంద్రబాబు ఆలోచన అంటే! పరిశ్రమలపేరుతో ఏనాడు చంద్రబాబు రైతులనుంచి బలవంతంగా భూములు తీసుకోలేదు. రైతుల్ని ఒప్పించి, వారికి ఆమోదయోగ్యమైన పరిహారంఇచ్చాక, వారు సంతోషంగా భూములిచ్చారు. మూడు రాజధానుల్ని ఆపేవాళ్లు ఎవరైనా, వారుద్రోహలేనని స్పీకర్ తమ్మినేని అంటున్నాడు. రాయలసీమ వాసులు విశాఖ వెళ్లాలంటే ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పాలని తమ్మినేనిని అడుగుతున్నాం. తనప్రాంత ప్రజలు విశాఖప్రాంతానికి వెళ్లడం ఎంతవరకు వీలవుతుందని జగన్ రెడ్డి ఏనాడైనా ఆలోచించాడా? ఎన్నికలకు ముందు అమరావతికి జై అన్న జగన్ రెడ్డి, ఇప్పుడు విశాఖ రాజధాని అంటూ రాయలసీమద్రోహిగా మిగిలిపోయాడు” అని కిష్టప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు.

Leave a Reply