– టీడీపీ శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
సీఎం జగన్ అమ్మఒడి కార్యక్రమం ప్రతిపక్షాలను తిట్టడానికి పెట్టినట్టుంది. సభలో విద్యార్దులకు సందేశం ఇవ్వాల్సిన సీఎం ప్రతిపక్షాలపై విషం చిమ్మటం దుర్మార్గం. రాష్ట్రంలో 84లక్షలమంది విద్యార్థులుంటే, కేవలం 42లక్షలమందికి ఆర్థికసాయం అందిస్తూ, మిగిలినవారికి జగన్ అన్యాయం చేస్తున్నాడు.
పేదలకు అన్యాయంచేస్తూ ఆ సొమ్ముని తనఖజానాకు మళ్లిస్తున్నాడు. అమ్మఒడి కింద ఒకసంవత్సరం తల్లులకు రూపాయి ఇవ్వకుండా పంగనామాలు పెట్టాడు.అమ్మఒడికింద రూ.26వేలకోట్లు తల్లులకు ఇచ్చిన జగన్, నాన్నబుడ్డి కింద తండ్రుల నుంచి రూ.91వేలకోట్లు కొట్టేశాడు. వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్ పెయిర్ డేట్ దగ్గర పడింది .ఎన్నికలు ఏడాది ఉండగానే సీఎం ముఖంలో ఓటమి భయం కన్పిస్తోంది. 2024 తర్వాత ఏపీలో వైసీపీ జెండా పీకేయటం ఖాయం.