చంద్రబాబు, ఎల్లో మీడియాకు మాత్రమే సమ్మె కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే ఎల్లో మీడియాకు పండగ. సంధి జరిగింది…ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంలేదని వారికి మంట. ఉద్యోగులు సమ్మె విరమించారు అనగానే కమ్యూనిస్టులను ముందుకు తోశారు. సీఎం తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తారు.
ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న వ్యక్తి… రామోజీరావుకు ముద్దుబిడ్డగా ఉన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న వ్యక్తి రాధాకృష్ణకు ఆత్మీయుడు. బీసీలు జడ్జీలుగా పనికి రారని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు. పేదల ఇళ్లను అడ్డుకున్న వ్యక్తి కామ్రేడ్లకు ఆత్మీయుడు.