Suryaa.co.in

Andhra Pradesh

క్వింటా ధర రూ.20వేలైతేనే మిర్చి రైతులకు గిట్టుబాటు

– ప్రభుత్వ నిర్లక్ష్యం, దళారుల మోసంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు
-రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్న ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ.?
-రైతులు పెట్టిన రూ.3400 కోట్ల పెట్టుబడి బూడిదపాలైంది
– పొన్నూరు టీడీపీ ఇంఛార్జ్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్

మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో మిర్చి రైతన్నల పరిస్థితి అగమ్యఘోచరంగా మారింది. గిట్టుబాటు ధరలేక, పెట్టుబడి రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఎకరాలకు పైగా రైతులు మిర్చిని సాగుచేశారు. పెట్టిన రూ.3400 కోట్ల పెట్టుబడి బూడిదపాలు పాయింది. ప్రభుత్వ సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదు. క్వింటాకు కనీసం రూ.20వేలు ధర కల్పిస్తేనే నష్టం వాటిల్లకుండా ఉంటుంది. రంగులు వేయడానికి రూ3 వేల కోట్లు ఖర్చుపెట్టాడు కానీ రైతులను ఆదుకోవడానికి ఖర్చు పెట్టరా?

మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోవడం లేదు.? బీమా పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయకుండా ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదు. రైతులను బీమా కట్టనీయకుండా..ప్రభుత్వం కట్టకుండా నిలువునా ముంచారు. టీడీపీ హయాంలో మిర్చి ధర తగ్గితే క్వింటాకు రూ.1500లను రైతులకు నేరుగా చంద్రబాబు నాయుడు అందించారు. నష్టాలబారీన పడకుండా మిర్చి రైతులకు ప్రత్యేకంగా రూ.3556 కోట్లను టీడీపీ ప్రభుత్వం కేటాయించింది.

కానీ ఈ ప్రభుత్వం కనీసం వారి సమస్యలపై సమీక్ష కూడా చేయలేదు. ఒక్కో ఎకరాకు రూ.70 వేల నుండి లక్ష వరకూ పెట్టుబడి పెట్టారు. వ్యవసాయానికి ఉన్న సబ్సీడీలన్నీ ఈ ప్రభుత్వం రద్దు చేసింది. రైతులంటే వైసీపీకి ఎంత చిన్నచూపో ఇలాంటి సంఘటనలు చూస్తే అద్దంపడుతుంది. రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్న ధరల స్థిరీకరణ నిధితో ఎందుకు ఆదుకోవడం లేదు? రైతు వంచన పార్టీగా వైసీపీ మిగిలిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కో రైతు కుటుంబంపై 2.5 లక్షల అప్పు పెరిగింది.

కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రం ఉంది. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించలేని ప్రభుత్వం ఉంటే ఎంత..లేకుంటే ఎంత.? జగన్ సర్కార్ పై రైతులు తిరగబడే రోజు వస్తుంది.

LEAVE A RESPONSE