Suryaa.co.in

Andhra Pradesh

రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన

ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించనున్న ముఖ్య‌మంత్రి

తాడేప‌ల్లి: రేపు (06.04.2023) సీఎం వైయ‌స్ జగన్‌ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ప‌ర్యటించ‌నున్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని సీఎం వైయ‌స్‌ జగన్ ప్రారంభించ‌నున్నారు.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు లింగంగుంట్ల చేరుకుంటారు. అక్కడ డాక్టర్ వైయ‌స్సార్‌ విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ని పరిశీలించిన అనంతరం సమీపంలోని ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ స్టాళ్ళను పరిశీలించనున్నారు. ఆ తర్వాత కావూరు గ్రామంలో సభా ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

LEAVE A RESPONSE