ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి కాలినొప్పి కారణంగా బుధవారం వైయస్ఆర్ జిల్లా పర్యటన రద్దు అయ్యింది. ఉదయం ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో ఆయనకు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి పెరిగింది.
గతంలో ఇలానే కాలికి గాయం కాగా, చాలా రోజులపాటు సీఎం ఇబ్బందిపడ్డారు. తాజాగా మళ్లీ కాలినొప్పి రావడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.