Suryaa.co.in

Andhra Pradesh

ఢిల్లీ ఏపీ భవన్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్‌ పుట్టినరోజు వేడుకలు

– భారత రాజకీయాల్లోనే జగన్ కి ప్రత్యేకమైన స్థానం
– ఒత్తిళ్ళకు, కష్టాలకు తలవంచని వ్యక్తిత్వం జగన్‌ ది
– ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న జగన్‌
– జగన్ పాలన మరో 30 ఏళ్లు కొనసాగాలి
– వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఘనంగా జరిగాయి. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతో పాటు ఏపీ భవన్‌ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌ చేసి జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని వేడుకలకు హాజరైన నాయకులు మాట్లాడుతూ ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే…
భారత రాజకీయ వ్యవస్థలోనే జగన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 2009లో వైఎస్‌ జగన్ గారి రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన వ్యక్తిత్వంతో పార్టీ నిలబడింది. వైఎస్‌ఆర్ గారి కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉంది. సీఎం జగన్ గారు వందేళ్లు చల్లగా జీవించాలి. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేయాలన్నారు.

ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని బలంగా విశ్వసించే రాజకీయ నాయకుడిగా ప్రజల మనస్సుల్లో అచిరకాలంలోనే ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్నా.. ఆయన చలించలేదు. ప్రతిపక్షాలు ఎన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేసినా, ఎన్ని కష్టాలకు గురి చేసినా, తలవంచని వ్యక్తిత్వం జగన్‌ ది.

సీఎం జగన్‌ ప్రతి అడుగులోనూ కమిట్‌మెంట్‌ ఉంటుంది. ప్రజల సమస్యలు తెల్సుకుంటూ.. 175 నియోజకవర్గాల్లో.. ఆయన చేసిన పాదయాత్ర, ఓదార్పు యాత్రల ద్వారా ప్రజల మనసులు, వారి ఆకాంక్షలను తెల్సుకునే అవకాశం కలిగింది. అందుకే.. జగన్‌ గారు ఈరోజు ప్రజాభిమాన నేతగా నిలిచిపోయారు. ప్రజల ఆకాంక్షలను ఆకళింపు చేసుకొని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన ఘనత జగన్‌ కి దక్కుతుంది.
ముఖ్యంగా పేద ప్రజలు, అణగారిన వర్గాలు, జండర్ జస్టిస్, భావితరం పిల్లలు, రైతులు, మన గ్రామం, మన పరిపాలన వ్యవస్థల మార్పులు, గ్రామ స్వరాజ్యం, ప్రాంతీయ ఆంకాంక్షల మీద పూర్తి అవగాహనతో పరిపాలన చేస్తున్న సీఎం జగన్ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పార్లమెంట్ సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు.

ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి , మిథున్‌ రెడ్డి, భరత్‌, వంగా గీతా, తలారి రంగయ్య, రెడ్డప్ప, మాధవ్, గురుమూర్తి, సంజీవ్‌, లావు కృష్ణదేవరాయులు, శ్రీధర్, ఆర్‌.కృష్ణయ్య, ఏపీ భవన్‌ ఉద్యోగులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE