అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్ళారు. తొలుత పి.గన్నవరం మండలం జి. పెదపూడి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ భారీ వర్షం పడుతున్నా ఆయన పర్యటన కొనసాగింది. వర్షంలోనే ఆయన వరద బాధితులను పరామర్శించారు. అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. ఆయన ఇవాళ ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. అలాగే మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడ వరదబాధుతులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం పర్యటించిన తరవాత సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. ఇవాళ రాత్రి అక్కడే బసచేస్తారు.