ఎమ్మెల్యే గద్దె రామమోహన్
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అనేది పేద ప్రజలకు వరం లాంటిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామోహన్ అన్నారు.
బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ సున్నపుబట్టీల సెంటర్ అమ్మకళ్యాణ మండపం ఎదురుగా మసీదు రోడ్డులో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.75 వేల చెక్కును పుప్పాల జాహ్నవికి, ఆరో డివిజన్ పార్టీ కార్యాలయం దగ్గర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.27 వేల చెక్కును కనపర్తి యశోధకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా వారికి అందచేశారు. వారి ఆరోగ్య పరిస్తితిని తెల్సుకుని వారికి చెక్కుతో పాటుగా స్వీటాప్యాకెట్ అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేద ప్రజలకు వరమని చెప్పారు. అనుకోని పరిస్తితుల్లో ఏదైనా ప్రమాదం జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళితే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నగదును అందచేస్తారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయాల నిధులను పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కొంతమంది ఒకరు లేదా ఇద్దరికి సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు ఇచ్చి కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నారని చెప్పారు.
గత 2014-19 సంవత్సరాల మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే రూ.16 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు అందచేశానని గద్దె రామమోహన్ చెప్పారు. పేదల సంక్షేమానికి చిత్తశుద్ధిలో పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబునాయుడేనన్నారు. దళితుల సంక్షేమానికి ఎంతో చేశానని చెప్పుకున్న జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ సబ్న్ నిధులను పక్కదారి పట్టించారని చెప్పారు. మంచి మనస్సుతో, ప్రేమతో పేదల కోసం పనిచేసేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నందిపాటి దేవానంద్, చెన్నుపాటి ఉషారాణి, పడాల గంగాధర్, ఎ.రామకృష్ణ, పల్లి దుర్గా ప్రసాద్, దోమకొండ రవి, కోడూరు సుబ్రమణ్యం, పునుగుమాటి పురుషోత్తం, షేక్. షరీప్, అమిర్నేని కరుణకుమారి, రాచమల్ల ఆంజనేయులు, సిద్దెల వివేక్, మొకర గురునాధం, పదాల వాసు, పాలవలస శివ, సప్పా శ్రీను, వడ్డేపల్లి కేశవ్ తదితరులు పాల్గొన్నారు.