– ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డి ది
-బిఆర్ఎస్ లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు
-సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ ఫైర్
హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు వాడుకోవడం ఆయన దుస్థితి కి నిదర్శనం. ఉద్యోగ నియామక పత్రాలిచ్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన ఉన్మాద ప్రవృత్తిని మరోసారి బయట పెట్టుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఇంకెంత కాలం డప్పు కొట్టుకుంటావు రేవంత్ రెడ్డి?
ఏడాదిన్నరగా నువ్వు ఇస్తున్న నియామక పత్రాలు అన్ని కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లె కదా? ఈరోజు కూడా కెసిఆర్ ప్రభుత్వ హయంలో ఇచ్చిన పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్లకు, పెట్టిన పరీక్షలకు నియాక పత్రాలు ఇచ్చినవు. కేసీఆర్ హయం లో మొదలై చివరి దశకు వచ్చిన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ను పూర్తి చేసి జబ్బలు చరచుకుంటే బొప్పి కట్టడం తప్ప ఒరిగేదేమి ఉండదు.
తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం లక్షా 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం. ఏడాదిన్నర కాలంలో నోటిఫికేషన్ల ద్వారా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 5, 6 వేలు మించ లేదనేది వాస్తవం. 95% ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కేలా కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీల అమలులో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ అయ్యింది. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది. నిరుద్యోగ భృతి తీవ్ర నిరాశను మిగిల్చింది. రేవంత్ లాంటి కుసంస్కారి కేసీఆర్ పై చిల్లర విషయాలు చెబితే నమ్మడానికి ఉద్యోగాలు పొందిన వారు అమాయకులు కారు. 55 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పిన అబద్ధాన్నే ప్రతి చోటా చెబుతూ రేవంత్ తుపాకీ రాముడిని మించిపోయారు. పాలన చేతకాక రేవంత్ ‘పరనింద”నే పనిగా పెట్టుకున్నారు. సీఎం గా వచ్చిన అవకాశాన్ని రాష్ట్రం బాగు కోసం వాడక తన పదవి ఉంటుందో ఊడుతుందోనని అభద్రతా భావం తో మాట్లాడుతున్నారు.
తన పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతూ బీ ఆర్ ఎస్ పై నెపం నెట్టి సానుభూతి రాజకీయానికి తెర లేపుతున్నారు. హంతకుడు సంతాప సభ పెట్టినట్టు ఉంది రేవంత్ తీరు. రాష్ట్రానికి కేన్సర్ సోకిందంటూ రేవంత్ రెడ్డి ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. తన చేతకాని తనాన్ని రాష్ట్ర ప్రజలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధమాడకపోతే పూట గడవదు అనే పద్దతి లో రేవంత్ వ్యవహారం ఉంది.
గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి గారడీ మాటలు చెబుతున్నాడు. రేవంత్ రెడ్డి కి కాన్సిల్ జబ్బు సోకింది. ఎన్నికలపుడు తాను చెప్పినవన్నీ కాన్సిల్ అంటున్నాడు. ప్రతిపక్ష నేతలు ప్రజల పక్షాన పోరాడుతుంటే వాళ్ళ మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డి ది. పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి నిజాన్ని నమ్ముకోలేదు నిందలనే నమ్ముకున్నాడు. కష్టాన్ని నమ్ముకోలేదు.. కుతంత్రాలనే నమ్ముకున్నాడు. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి తాను ఉన్నది సీఎం పదవిలో అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని చిల్లర వేషాలు మానితే మంచిది.