-సీఎం చంద్రబాబును ఆహ్వానించిన మంత్రి, అధికారులు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వచ్చే నెల మూడోతేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు.