పశ్చిమ బెంగాల్ లోని డార్జింగ్‌లో సోమవారం ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే.. దీంతో ప్రమాదం కారణంగా ఆ రూట్లలో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. తాజాగా రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఆ రూట్‌లో యధావిధిగా రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రమాదం అనంతరం ఫన్సిడేవా వద్ద రైల్వే ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడి పోయిన బోగీలను సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. విద్యుత్ లైన్లను బాగు చేశారు.