Suryaa.co.in

Features

ఇక్కడ పౌరుడు ఏడ్చే పోరడు!

సంపన్నులనూ ఆపన్నులను
చేసిన సర్కారు వారి “పన్ను”
అది నిరంతరం గుచ్చే పిన్ను..
వేధించే పిప్పి పన్ను..
అడ్డగోలుగా పెంచుతూ
సంతకం చేసిన పెన్ను..
కట్టకపోతే కరెంటు తీసేసి
ఆపేస్తారట ఫేను…
ఇల్లు జప్తు చేసేసి విరిచేస్తారంట నీ వెన్ను..
బలవంతంగా అడిగే
అధికార్లకు ఖాకీల దన్ను..
రుబాబు చూపిస్తూ
ఏకం చేసేస్తున్నారు
మిన్ను మన్ను..
కట్టేటప్పటికి చావు
తప్పి లొట్టపోయే కన్ను!

ఇక సినిమా టికెట్లు..
రోజుకో రకం ఇక్కట్లు..
చిరంజీవి దిగి వస్తే ఫ్లైట్లు
మారిపోయే రేట్లు..
రాజమౌళి చేసుకుంటే
దర్శనం ఆయన మూవీకి
సెప’రేట్లు’..
అది మామూలు కంటే
ఎన్నో రెట్లు..
పవర్ స్టార్ కి
మాడిపోయే బొబ్బట్లు..
ఏంటో ఈ ఫీట్లు..
రెండున్నర గంటల వినోదానికి ఇన్ని పాట్లు..
ఇందులోనూ ఇన్నేసి
రాజకీయ ప్లాట్లు!

నిన్నటి వరకు
ఓ రేటున్న గ్యాసు బండ
ఈరోజు అయింది
మోయలేని మరో గుదిబండ
సెంటరోడికి స్టేటోడి అండ..
ధరలు పెంచితే ఈడికి ఆడు
ఏసేస్తాడో దండ..
మొత్తానికి ఇద్దరూ కలిసి
జనం నెత్తిన పడేత్తున్నారు
చెరో బండ..
ఇలా దోచేసిన సొమ్ములు
స్కీముల పేర పంచేత్తున్నారు
ఆళ్ళ గవర్మెంట్లు కూలిపోకుండ..
ఈళ్ల ధర్మమా అని బతుకు
అయిపోనాది సిల్లుకుండ
ఆళ్లు బతికేస్తున్నారు రాజాల్లా జనం కళ్ళు మండ ఆళ్మమ్మల కడుపులు చల్లగుండ..!

సురేష్ కుమార్ E
9948546286

LEAVE A RESPONSE