Suryaa.co.in

Andhra Pradesh

అరగుండు అరమీసంతో వినూత్న నిరసన

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఓ అభ్యర్థి వినూత్న నిరసన చేశారు. అరగుండు, అరమీసంతో ఆందోళన చేశారు.నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 50వ వార్డు నుంచి పోటీ చేసి, పరాజయం పాలైన తెదేపా అభ్యర్థి వినూత్న నిరసన తెలిపారు. వైకాపా అక్రమాలకు పాల్పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచిందని ఆరోపించారు.అరగుండు, అరమీసంతో ఆందోళన చేశాడు. ‘జగన్ పోవాలి – బాబు రావాలి’ అని పలక మీద రాయించుకుని, మెడలో వేసుకున్నారు. మళ్లీ జనరల్ ఎన్నికలు జరిగే వరకూ ఇలాగే ఉంటానని శపథం చేశారు.

LEAVE A RESPONSE