– బిల్లుల చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారు
– ఏసీబీ, విజిలెన్స్‌కు బిల్డర్‌స అసోసియేషన్ ఫిర్యాదు
విజయవాడ: సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్‌రెడ్డిపై విజిలెన్స్-ఏసీబీ విచారణ తప్పేలా లేదు. బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏపీ బిల్డర్స్ అసోసియేషన్, ఏసీబీ-విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. రావత్, సత్యనారాయణపైనా వారు ఫిర్యాదు చేశారు. దీనితో వారిపై విచారణకు రంగం సిద్ధమవుతోంది. ఈనెలతో జవహర్‌రెడ్డి రిటైర్ అవుతున్నప్పటికీ, ఆయన విచారణ నుంచి తప్పించుకోలేరని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
అమరావతి: సీఎస్ జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రావత్, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. ఎసీబీ , విజిలెన్స్ డీజీలకు ఫిర్యాదు చేసింది. బిల్లులు చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. బిల్లుల చెల్లింపులో ఫిపో పద్ధతిని పాటించకుండా తమకు ఇష్టం వచ్చిన వారికి చెల్లించారని అసోసియేషన్ ఆరోపించింది. 2019 నుంచి 2024వరకు చెల్లింపులపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్అండ్‌బీ కేంద్రం నుంచి వచ్చిన ఇతర గ్రాంట్లలో కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ కోరింది.