Suryaa.co.in

National Uncategorized

‘పుష్ప-2’ పై ఎన్‌హెచ్‌ఆర్సీకు ఫిర్యాదు

ఢిల్లీ:అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమాపై న్యాయవాది ఇమ్మినేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై దర్యాప్తు జరపనుంది.

రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా.. పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపైనా రామారావు అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో తెలిపారు.

చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్టు పిటిషనర్ ఆరోపించారు.

LEAVE A RESPONSE