Suryaa.co.in

Andhra Pradesh

మాచర్ల ఎస్సై బత్తుల గోపాల్ పై ఎస్పికి ఫిర్యాదు

ఎస్పి మల్లిక గార్గ్ కి ఫిర్యాదు చేసిన ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి కోట వెంకట సుబ్బయ్య కుటుంబం.

గత ఏడాది జూన్ లో రావిపాడు గ్రామానికి చెందిన కోట వెంకట సుబ్బయ్యది 3.75 ఎకరాల పొలం తన భార్య వరలక్ష్మి పేరుతో 37లక్షలకి ఎస్సై గోపాల్ కొన్నారు. కొనుగోలులో భాగంగా ఎస్సై గోపాల్ 24 లక్షలు చెల్లించారు. మిగిలిన 13 లక్షలు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని ఎస్పి మలిక గార్గ్ కి బాధితులు వేడుకున్నారు.

మిగిలిన డబ్బులు అడిగితే చంపేస్తామని ఎస్సై అన్న వైసీపీ ఉప సర్పంచ్ ఈశ్వరయ్య బెదిరిస్తున్నాడని చెప్పారు. ప్రస్తుతం ఎస్సై బత్తుల గోపాల్ మాచర్లలో విధులు నిర్వహిస్తున్నారు.

LEAVE A RESPONSE