Suryaa.co.in

Andhra Pradesh National

కడప-బెంగుళూరు రైల్వే లైను నిర్మాణ భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయండి:సిఎస్

అమరావతి,3 జూన్:కడప-బెంగుళూరు రైల్వే లైను ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కడప,చిత్తూరు జిల్లాల కలక్టర్లను ఆదేశించారు.ప్రతినెల ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్వహిస్తున్న ప్రగతి అంశాల్లో భాగంగా ఉన్న కడప-బెంగుళూర్ రైల్వే లైను ప్రాజెక్టుకు సంబంధించి శుక్రవారం సిఎస్ డా.సమీర్ శర్మ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈరైల్వే లైను నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని చిత్తూరు,కడప జిల్లాల కలెక్టర్లను వీడియో సమావేశం ద్వారా ఆదేశించారు. వారం రోజుల్లోగా రైల్వే జియంతో సమాశం ఏర్పాటు చేసి ఈ రైల్వే లైనుకు సంబంధించి పనులను వేగవంతం చేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు.అనంతరం ప్రగతికి సంబంధించిన ఇతర అంశాలపై సిఎస్ డా.సమీర్ శర్మ సమీక్షించారు.
సమావేశంలో టి ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE