• వివిధ రంగాల్లో డ్రోన్ల సాంకేతిక వినియోగంపై 9 సెషన్లు
• 4 కీలక ప్రజెంటేషన్లు
• అమరావతిని దేశంలో భవిష్యత్తు డ్రోన్ సిటీగా రూపొందించే అంశంపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్
• దేశ నలుమూలల నుండి డ్రోన్ తయారీదారులతో 40 ఎగ్జిబిషన్లు
• డ్రోన్ల వినియోగ విధానం, ఉపయోగాలపై డిమానిస్ట్రేషన్
• 22న విజయవాడ కృష్ణానది బెర్ము పార్కు వద్ద 5 వేల డ్రోన్లతో డ్రోన్ షో, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు
• ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
అమరావతి: మంగళగిరి సీకే కన్వెన్షన్ లో ఈనెల 22, 23 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈమేరకు డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా పెద్ద ఎత్తున డ్రోన్ సమ్మిట్ కు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈరెండు రోజుల డ్రోన్ సమ్మిట్ ను పూర్తిగా విజయవంతం చేసేందుకు వివిధ శాఖల కార్యదర్శులు వెంటనే సదస్సు ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వరకు వక్తలు, ప్రతినిధులు విచ్చేయనున్నారని, అంతేగాక 1000 మంది వరకూ వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు, విద్యార్ధులు, ప్రొపెషనల్స్, సాంకేతిక అభిలాషులు తదితరులు పాల్గొంటారని సీఎస్ పేర్కొన్నారు.
ఈ రెండు రోజుల డ్రోన్ సమ్మిట్ లో ప్రధానంగా డ్రోన్ల తయారీ, వ్యవసాయ, లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాల్లో డ్రోన్లను వినియోగం అంశాలపై తొమ్మిది సెషన్లు ఉంటాయని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. అంతేగాక డ్రోన్ల సాంకేతికత వినియోగంపై నాలుగు కీలకమైన ప్రజంటేషన్లతో పాటు బిల్డింగ్ ఏ క్రాంప్రహెన్సివ్ డ్రోన్ ఇకో సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అమరావతిని భవిష్యత్తులో డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియా తీర్చిదిద్దే అంశంపై ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుందని అన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీ దారులు వారి ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శన శాలలను వేదిక వద్ద ఏర్పాటు చేయనున్నారు. అంతేగాక డ్రోన్ డిమానిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుందని సీఎస్ తెలిపారు.
2030 నాటికి భారత్ ను గ్లోబల్ డ్రోన్ హబ్ గా రూపొందించడం, డ్రోన్ రెగ్యులేషన్స్ పై ఫ్యానల్ డిస్కషన్స్ ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. అంతేగాక పబ్లిక్ సేప్టీ, విపత్తుల నిర్వహణ, డ్రోన్ సాంకేతికత అప్లికేషన్స్ అడాప్సన్, పబ్లిక్ ప్లానింగ్ పైన, స్కిల్డ్ మేన్ పవర్ ఫర్ డ్రోన్ ఇకో సిస్టమ్ ఇన్ ఇండియా, పర్యాటక, వినోద రంగాల్లో డ్రోన్స ఇన్నోవేషన్, ఏరియల్ ఎక్సిఫీరియన్సెస్ అంశాలపైన ఫ్యానల్ చర్చలు నిర్వహిస్తారని తెలిపారు. వ్యవసాయ, ఆరోగ్య, లాజస్టిక్ రంగాల్లో డ్రోన్ల వినియోగం, సర్వే సెటిల్మెంట్స్, భూ రికార్డులు, డిజిటల్ లాండ్ రికార్డులు తయారీలో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై ఫ్యానల్ డిస్కషన్స్ జరుగుతాయని సీఎస్ పేర్కొన్నారు.
రెండు రోజుల అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024లో భాగంగా 22వ తేదీ సాయంత్రం 6 గం.ల నుండి రాత్రి 8 గం.ల వరకూ విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ పార్కు వద్ద పలు సాంస్కతిక కార్యక్రమాలను ఉంటాయన్నారు. ముఖ్యంగా 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో ను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అంతేగాక లేజర్ బీం షో,ఫైర్ వర్క్సు, మ్యూజిక్ బ్యాండ్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ రెండు రోజుల డ్రోన్ సమ్మిట్ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సహా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, పలువురు రాష్ట్ర మంత్రులు, పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారని సీఎస్ చెప్పారు. ఈ సమ్మిట్ విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో ఐ అండ్ ఐ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈడ్రోన్ సమ్మిట్ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. వివిధ శాఖల నుండి 10 ప్రత్యేక నోడలు అధికారులను నియమించాలని ఆయా శాఖల కార్యదర్శులను కోరినట్టు తెలిపారు. సమావేశంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండి కె.దినేష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 కు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సీఎస్ కు వివరించారు.