Suryaa.co.in

Andhra Pradesh

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయించండి

– కనకారావు, విజయ్ పాల్ లపై చర్యలు తీసుకోండి
– ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారంటూ జాతీయ ఎస్సీ కమీషన్ – డీజీపీకి పిర్యాదు చేసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతున్నది. తెలుగుదేశంపై కక్షసాధించడానికే చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు అధికారపార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగి టిడిపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.
వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన వైకాపా గూండాలు ఈనెల 20 న తెదేపా రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా ఇంటిపై దాడి చేశారు. చిన్నా భార్యను బెదించారు. విషయం తెలుసుకున్న తెదేపా నేత పట్టాభిరాం గన్నవరం టిడిపి పార్టీ ఆఫీసు చేరుకుని ఇతర నాయకులతో చర్చించి దీనిపై పోలీసులకు పిర్యాదు చేద్దామనుకున్నారు. పోలీస్ స్టేషన్ పిర్యాదు చేసేందుకు పార్టీ ఆపీసు నుంచి బయటకు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇంతలో వైకాపా గూండాలు అక్కడకు చేరుకుని గన్నవరం పార్టీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వసం చేశారు. కారుకు నిప్పంటించి ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు.ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది.

వైకాపా గూండాలు విరిసిన రాయి అక్కడ డ్యూటీలో ఉన్న పొగిరి కనకరావు అనే పోలీస్ ఇన్పెక్టర్ గాయపడ్డాడు. దీన్ని అవకాశంగా మలచుకున్న పోలీసు అధికారులు తెదేపా నాయకులు కనకరావును చంపేందుకు ప్రయత్నించారంటూ ఐపిసి 307, ఎట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించి తెదేపానేత పట్టాభిరాం మరికొందరిపై కేసులు పెట్టారు. తెదేపా నాయకులపై నమోదుచేసిన ఎఫ్.ఐ.ఆర్ లో కనకారావు క్రిస్టియన్ అని చాలా స్పష్టంగా పేర్కొని ఉంది.చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి క్రిస్టియన్ అయితే ఆ వ్యక్తి ఎస్సీ హోదా కోల్పోతాడు.అంతేకాకుండా ఆ వ్యక్తి బీసీ-సి కేటగిరికి చెందుతాడు. కాబట్టి, తెదేపా నేతలపై ఎస్సీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని పిర్యాదుచేసిన ఎస్సై కనకారావు ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదు. తెదేపా నాయకులను జుడీషియల్ కస్టడీకి అప్పగించాలనే దురుద్దేశంతోనే ఎట్రాసిటీ కేసులు నమోదుచేశారు. విచారణ అధికార డీఎస్సీ విజయ్ పాల్ సైతం తెదేపా నాయకులను కేసులో ఇరికించాలనే విచారణ తప్పులతడకగ చేశారు.

ఎఫ్.ఐ.ఆర్ లో ఏ-8 గా ఉన్న వ్యక్తి ఎస్సీ కులానికి చెందినప్పటికీ అతనిపై ఎట్రాసిటీ కేసు నమోదు చేయడం విచారణ అధికారి నిర్లక్ష్యవైఖరికి నిదర్శనం. ఇలాంటి కేసుల్లో ప్రతీ ముద్దాయి సామాజిక నేపధ్యంపై సమగ్ర విచారణ చేయాలని హైకోర్టు, అఫెక్స్ కోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అలా చేయలేదు. ఐపిసి సెక్షన్ 307 ను ప్రయోగించడంపై సైతం విచారణ సరిగా చేయలేదు. ఎట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని కోరిన పిర్యాదుదారుడి ఉద్దేశం కనిపెట్టడంలో విచారణ అధికారం ఘోరంగా విఫలమయ్యారు. ఈ నేపధ్యంలో కమీషన్ వారు ఎట్రాసిటీ దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయించండి. చట్టాన్ని దుర్వినియోగం చేసిన పిర్యాదుదారుడు కనకారావుపై, ఉద్దేశపూర్వకంగా విచారణను తప్పుల తడకగా చేసిన విచారణ అధికారి విజయ్ పాల్ లపై చర్యలు తీసుకోండి. త్వరితగతిన మీరు తీసుకునే నిర్ణయం ఎట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది.

LEAVE A RESPONSE