ట్విట్టర్ టిల్లు… నీ అయ్య లేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకవ్

Spread the love

-నీ లెక్క అయ్య పేరు చెప్పుకుని పదవులు తీసుకోలేదు
-నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చిన
-ప్రజల కోసం అనేకసార్లు జైలుకు పోయొచ్చిన
-దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పి మోసం చేసిన నీచులు మీరు
-బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇంకెవరైనా సీఎం కాగలరా?
-సామాన్య కార్యకర్తను కూడా ప్రధాని, రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే
-కాళేశ్వరం పేరుతో ముంచిన మూర్ఖుడు కేసీఆర్
-బ్యాక్ వాటర్ తో ముంపుకు గురైన పంటలకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు?
-సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తోంది కేసీఆరే
-కేంద్రం నిధులిస్తుంటే దొంగిలిస్తున్న మూర్ఖుడు కేసీఆర్
-మంథని నియోజకవర్గంలో ఇసుక దోపిడీ ఏరులై పారుతోంది
-ప్రశ్నిస్తే హత్యలు చేస్తున్న బీఆర్ఎస్ గూండాలు
-వామన్ రావు ను హత్య చేసిన వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు
-మోటార్లకు మీటర్లు పెడతాం.. లోన్ ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపింది కేసీఆరే
-దమ్ముంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి
-కేసీఆర్ పవర్ కట్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్
-బీజేపీతోనే తెలంగాణలో రామరాజ్యం సాధ్యం
-అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం
-ఫసల్ బీమా అమలు చేస్తాం.. అందరికీ ఇండ్లు కట్టిస్తాం
-కాటారం ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభలో బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

‘‘ట్విట్టర్ టిల్లు నిన్న ఈ జిల్లాకు వచ్చి నామీద పిచ్చికుక్కలెక్క అరిచిండట… నాది కార్పొరేటర్ స్థాయి అట… ఏయ్ ట్విట్టర్ టిల్లు… మీ అయ్య లేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకవ్… నీ అయ్య పేరు చెప్పుకుని పదవులు సంపాదించి ఊరేగుతున్న చరిత్ర నీది… నమ్మిన సిద్ధాంతం కోసం, దేశం, ధర్మం కోసం ప్రజల కోసం పోరాడి ఈ స్థాయికి వచ్చిన చరిత్ర నాది.’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. బీజేపీ నేత చందుపట్ల సునీల్ రెడ్డి మంథని నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర పేరిట గత 15 రోజులుగా నిర్వహించిన పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామితో కలిసి సునీల్ రెడ్డి పాదయాత్రలో నడిచారు. ఆ తరువాత జరిగిన ముగింపు సభను ఉద్దేశించి ప్రసంగించారు. భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాటారం మండల కేంద్రంలోని ఎల్జీ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభలో బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….

ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడే అడవీ ప్రాంతం మంథని. ఆ అడవులు ఏమైనయ్. నక్సలైట్లు చంపుతామని బెదిరించినా కొమరన్న భయపడలేదు. మా ఇంట్లనే ఉండేటోడు… ఆయన స్పూర్తితో బీజేపీ కార్యకర్తలు యుద్దం చేస్తున్నరు. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. మాకు స్పూర్తినిచ్చిన వెంకటనారాయణరెడ్డి పుట్టిన గడ్డ ఇది. యాత్రలు మాకు కొత్తకాదు. నక్సలైట్లు బెదిరించినా గతంలో బీజేపీ ఎన్నో యాత్రలు చేసింది. సీహెచ్. విద్యా సాగర్ రావు సస్యశ్యామల యాత్ర చేశారు. కాళేశ్వరం నీళ్లు ఎవరికైనా వచ్చాయా? 30 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేసి వేల కోట్లు దోచుకున్నడు.కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లను త్యాగం చేసిన ప్రజలకు నష్టపరిహారం ఇవ్వకుండా చిప్ప చేతికిచ్చిన మూర్ఖుడు. కాళేశ్వరం పేరుతో ముంచిండు. కేంద్రం పేరు చెప్పి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే నిన్ను గల్లాపట్టి గుంజుకొచ్చి సంగతి చెబుతాం… 51 శాతం రాష్ట్రానికి ఉంటే.. 49 శాతం వాటా ఉన్న కేంద్రం ఎట్లా ప్రైవేటీకరణ చేస్తది? అది సాధ్యమే కాదని ప్రధానమంత్రే స్వయంగా చెప్పినా బీఆర్ఎస్ నేతలు అబద్దాలాడుతున్నరు. సింగరేణి సొమ్మును కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా వాడుకున్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తోంది కేసీఆరే. ఉద్యోగాల్లో కోత విధించింది కేసీఆర్. ఓపెన్ కాస్టులను ప్రారంభించి సింగరేణిని బొందలు గడ్డగా మారుస్తోంది కేసీఆరే. ఈ సమస్యలన్నీ ప్రజలకు వివరించేందుకు సునీల్ రెడ్డి పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చే ఏకైక పార్టీ బీజేపీ. నిన్న ట్విట్టర్ టిల్లు ఈ జిల్లాకు వచ్చి గప్పాలు కొడుతున్నడు. మీ అయ్య లేకుంటే నిన్ను కుక్కలు కూడా దేకవు. నీ లెక్క నేను మోసపూరితంగా నాయకుడిని కాలేదు.. కష్టపడి పనిచేసిన. సిద్ధాంతం కోసం పనిచేసి ఈస్థాయికి వచ్చిండు.

బండి సంజయ్ 2005 నుండి 11 వరకు దేశం కోసం, ధర్మం కోసం 7 సార్లు జైలుకు పోయినోడు బండి సంజయ్.. మతతత్వవాదులు నన్ను చంపుతామని బెదిరించినా భయపడకుండా హిందూ సమాజాన్ని సంఘటితం చేసింది బండి సంజయ్. అందుకే బీజేపీ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది.నీలె క్క మోసం చేయలేదు. దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పింది మీరు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసింది మీరు. తెలంగాణ కోసం మీరు చేసిందెమిటి? బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి అట.. ఏయ్… ఇక్కడున్న బూత్ కమిటీ అధ్యక్షుల నుండి రాష్ట్ర నాయకుల వరకు రాష్ట్ర పగ్గాలు చేపట్టే అర్హత ఉంది. టీ అమ్ముకునే మోదీగారు ప్రధానిని, దళితుడిని, మైనారిటీని, ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదే.బీఆర్ఎస్ లో ఎవరికైనా సీఎం అయ్యే అర్హత ఉందా? కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి తప్ప ఏ ఒక్కరైనా బీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కాగలరా?

తెలంగాణ ఉద్యమం సమయంలో దొంగ దీక్ష చేసిన దొంగ కేసీఆర్. ఢిల్లీలో దీక్ష సమయంలో బాత్రూంలోకి పోయి ఫుల్లుగా తాగిన మూర్ఖుడు కేసీఆర్.. 1400 మంది యువకుల బలిదానాలతో సీఎం అయ్యిండు.. తాగుబోతును, ఫాంహౌజ్ కే పరిమితమై సచివాలయానికి వెళ్లని వ్యక్తిని సీఎంగా ఎట్లా చేశారని దేశ ప్రజలు నవ్వుకుంటున్నరు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు. కేసీఆర్ పై యుద్దాన్ని ప్రారంభించారు. కాషాయ జెండా ఎత్తి పట్టి జై తెలంగాణ అని గర్జిస్తున్నరు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు అధికారమిస్తే అన్యాయం చేశారే తప్ప ఒరగబెట్టిందేమీ లేదని ప్రజలు భావిస్తున్నరు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే మేలు జరుగుతుందనే భావనతోనే ప్రజలు బీజేపీపై నమ్మకంతో ఉన్నరు.

కేంద్రం నిధులిస్తుంటే దారి మళ్లిస్తున్న మోసగాడు కేసీఆర్. పంచాయతీ నిధులను కూడా దొంగలించిన దొంగ కేసీఆర్. కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తుంటే… అవి తామే ఇస్తున్నట్లు కేసీఆర్ ఫోజులు కొడుతున్నడు.రైతు వేదికలకు, స్మశాన వాటికలకు, హరితహారం, పల్లె ప్రక్రుతి వనాలకు, కమ్యూనిటీ హాళ్లకు, రోడ్లకు, జాతీయ రహదారులకు, రైల్వే నిర్మాణాలుసహా రాష్ట్రంలో జరిగే అభివ్రుద్ధి పనులన్నింటకీ పైసలిస్తోంది కేంద్రమే. అయినా పేర్లు మార్చి మోసం చేస్తున్న పార్టీ బీఆర్ఎస్. వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్రమే ఇస్తోంది. గోనె సంచెలు, రవాణా, సుతిలి తాడు సహా కేసీఆర్ సర్కార్ కు ఇచ్చే బ్రోకరేజీ కమీషన్ పైసలు కూడా ఇచ్చేది కేంద్రమే. కానీ మేమే కొంటున్నట్లు కేసీఆర్ ఫోజులు కొడుతున్నడు.

తెలంగాణలో ప్రశాంతత రావాలంటే రామరాజ్యం రావాలి. మంథని నియోజకవర్గంలో లాయర్ వామన్ రావు దంపతులను నడిరోడ్డుపై హత్య చేస్తే శిక్షించకుండా వదిలేస్తారా? బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్లను వదలిపెట్టే ప్రసక్తే లేదు. కఠినంగా శిక్షించి తీరుతాం. మంథని నియోజకవర్గంలో ఇసుకను దోచుకుంటున్నరు. కోట్లు కూడగడుతున్నరు. ఇదేమిటని ప్రశ్నిస్తే హత్యలు చేస్తున్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించొద్దు. దళిత బంధు ఇయ్యరు. రుణమాఫీ ఇయ్యరు. పోడు భూముల సమస్యలను పరిష్కరించరు. పట్టాలివ్వమని అడిగితే బాలింత అని చూడకుండా బేడీలు వేసి గుంజుకుపోయి జైలుకు పంపిన నీచుడు కేసీఆర్. ఏ పని చేయడానికైనా పైసలు లేవని చెబుతున్న కేసీఆర్ తన బిడ్డ దొంగ సారా దందాలో మాత్రం వందల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాడు. లిక్కర్ దందాలో బిడ్డ పేరు ఛార్జ్ షీట్ లో నాలుగు సార్లు వస్తే సీఎం ఎందుకు స్పందించలేదు. (బండి సంజయ్ మట్లాడుతుండగానే కరెంట్ కట్ చేశారు.)నేను యాడికి పోయినా కరెంట్ తీసేస్తున్నరు. మొన్న ఎల్బీనగర్ లో, మహేశ్వరంలో, అంతకుముందు అనేక చోట్ల ఇట్లనే కరెంట్ తీసేశారు. నేను చెబుతున్నా… బిడ్డా.. .త్వరలోనే నీ పవర్ (కరెంట్) తీసేయబోతున్నం.

యాడ చూసినా కరెంట్ పోతోంది. కేసీఆర్ మాత్రం 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ఫోజులు కొడుతున్నడు. డిస్కంలకు ఉచిత కరెంట్ బిల్లు కట్టడం లేదు.. 70 వేల కోట్ల బకాయిలున్నడు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ బకాయిలన్నీ కడితే… ఎవరు ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్లు? మీరే ఆలోచించాలి.
మోటార్లకు కేంద్రం మీటర్లు పెడుతున్నారని సీఎం అంటున్నడు.. ’‘కేసీఆర్… నువ్వు మగోడివైతే.. నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే నువ్వు నిజం చెప్పాలి. వ్యవసాయ మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వమే మీటర్లకు పెడతాం.. లోన్లు ఇవ్వండి అని కేంద్రానికి లేఖ రాశారా? లేదా?’’ సమాధానమివ్వాలి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల 4 ఏళ్లుగా 40 వేల ఎకరాల మునిగిపోతున్నయ్. ఇంతవరకు పరిహారం ఇయ్యకుండా రైతుల ఉసురు తీసుకుంటున్న నీచుడు కేసీఆర్.. బీజేపీ అధికారంలోకి వస్తే పంట నష్టపోయిన రైతులందరికీ ఫసల్ బీమా పరిహారం అందజేస్తాం. నిలువనీడ లేని నిరుపేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం. పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.

Leave a Reply