Suryaa.co.in

Andhra Pradesh

కన్నాకు టీడీపీ-జనసేన నేతల అభినందనలు

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధిగా ఖరారైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ-జనసేన నాయకులు అభినందించారు. గుంటూరు, సత్తెనపల్లి, పెదకూరపాడు, పత్తిపాడు, నర్సరావుపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు కన్నాను అభినందనలో ముంచెత్తారు. ఆయన విజయానికి శాయశక్తులా పనిచేస్తామని, కన్నా గెలవడం సత్తెనపల్లికి అవసరం అని టీడీపీ బీసీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. కన్నాను గెలిపిస్తే సత్తెనపల్లి లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని బీసీలంతా కన్నా వెంటే ఉన్నారని వెల్లడించారు.

LEAVE A RESPONSE