భావ సంద్రాన్ని మెదడు కవ్వంతో మథించగా పుడుతుంది ఆలోచన
ఆలోచన ఓ చైతన్యం
ఒక ప్రయాణం
ఒకప్రబోధం
ఒకముందడుగు
కార్యాచరణకు మెట్టు
ఆలోచన అంటే జీవన చర్యల అభ్యుదయం
ఆలోచన అంటే ప్రగతి
ఆలోచన అంటే బుద్ధి పోరాటం
మూగ చీకట్లను పారదోలే విద్యుత్తు
నిరాసక్తతనుఆసక్తిగా మార్చే ప్రయోగం
ఆలోచన ప్రపంచగమనానికి రహదారి
– వల్లభాపురం జనార్ధన
9440163687