– వైద్యారోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు
విజయవాడ : పిపిపి విధానంలో కొన్ని వైద్య కళాశాలల అభివృద్ధి, నిర్వహణ పట్ల తన వాదనకు తన పార్టీలోనే మద్దతు లేదని గ్రహించిన మాజీ సిఎం జగన్రెడ్డి గారికి నా అభినందనలు. ఆయన ఆదేశాల మేరకు వైసిపి శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమాల వైఫల్యం ద్వారా ఈ మేరకు జ్ఞానోదయం కలగడం మంచి పరిణామం.
తన పార్టీ నాయకులు, కార్యకర్తలే జగన్రెడ్డి గారి వాదాన్ని సమర్ధించకపోవడంతో నిరసన కార్యక్రమం నీరసించిపోయింది. పులివెందులలో కూడా జగన్ రెడ్డి ఆశించిన మేరకు మద్దతు లేకపోవడం ఆయన వాదనలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది.
2023-24తో ప్రారంభంమై మూడేళ్లలోనే 2,550 ఎంబిబియస్ ప్రవేశాలు కల్పిస్తామన్న మాజీ సిఎం పూర్తిగా చేతులెత్తేసి అతికష్టంతో 750 ప్రవేశాలపే మాత్రమే తన హయాంలో చేసిన ఆయన వైనాన్ని ప్రజలు గమనించారనే విషయం శుక్రవారం విఫలమైన వారి నిరసన కార్యక్రమం వెల్లడించింది. ప్రభుత్వ కాలేజీల్లో వార్షిక ఫీజును రూ.12 లక్షలు, రూ.20 లక్షలుగా పెంచి…రాజకీయ దురుద్దేశంతో నేడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడంతో జగన్ ద్వంద ప్రమాణాలను ప్రజలు అర్ధం చేసుకోవడంతో వారి నిరసన ఫ్లాప్ అయ్యింది.
పిపిపి విధానంపై చర్చకు రావాలన్న నా ప్రతిపాదనకు మాజీ సిఎం ఇంతవరకూ స్పందించలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని అహర్నిశలూ అనేక వ్యయప్రయాసలకు పాటుపడుతున్న జగన్రెడ్డి గారు ఇకనైనా చర్చకు రావాలి.
అందరినీ కొంతకాలం మోసగించొచ్చు…అందరినీ పూర్తి కాలం మోసగించలేవు జగన్రెడ్డి గారు!