– తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
సెప్టెంబర్ 17 నాడు జాతీయ సమైక్యతా దినోత్సవాన్నీ ఘనంగా నిర్వహిస్తున్నాం . జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ జమిలి ఎన్నికలు,మినీ జమిలి ఎన్నికల పేరుతో అన్ని పార్టీలను ,ప్రజలందరినీ గందరగోళంలోకి నెట్టింది.రాష్ట్ర భవిష్యత్ కోసం తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార పార్టీని గెలిపించాలి.
కాంగ్రెస్ పార్టీలో ప్రయారిటీ లేదని పరేషాన్ లో ఉన్న నేతలు కేసీఆర్ గారి పైన ,కేటీఆర్ గారి పైన , అనవసర ఆరోపణలు చేస్తున్నారు. మతిస్థిమితం ,స్థిరత్వం లేని వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . ఆయన ఎప్పుడూ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు.బి ఆర్ యస్ పార్టీలో తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారని అంటున్న కోమటి రెడ్డి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వైయస్ షర్మిళ ను ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమానికి బద్ధ వ్యతిరేకులు, రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన వారు ,ఎందరో ఆత్మబలిదానాలకు కారకులు నేటికి కాంగ్రెస్ పార్టీలోని కొనసాగుతున్నారు. కేటీఆర్ పైన ఆరోపణలు చేసే స్థాయి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లేదు. కేటీఆర్ గొప్పగా చదువుకున్న వ్యక్తి . కేటీఆర్ సమర్ధవంతమైన నాయకుడు. ఆయనకు అప్పగించిన శాఖల్లో గొప్పగా పని చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. కేటీఆర్ గారి కృషి వల్ల హైదరాబాద్ మహా నగరంలో ఎం. ఐ. ఎం. పార్టీ ఏడు సీట్లు, తప్ప అన్నీ స్థానాల్లో బి ఆర్ యస్ పార్టీనే గెలవబోతుంది .
మళ్ళీ బి ఆర్ యస్ పార్టీనే అధికారంలోకి వస్తోంది. సుస్థిరమైన బి ఆర్ యస్ ప్రభుత్వం ఏర్పాడుతోంది. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ,బిజెపి నేతలు పగటి కలలు కంటున్నారు.