సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్ ఏఐసీసీ ఓ బి సి నాయకులు నాగులూరి కృష్ణ కుమార్ గౌడ్ మద్దతు కోరారు. ఆదం సంతోష్ కుమార్ ఉదయం నాగులూరి కృష్ణ కుమార్ గౌడ్ ఇంటికి వచ్చి తన గెలుపుకు సహకరించాలని కోరారు.
కృష్ణ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తాను కూడా మూడు పర్యాయాలు నుండి సికింద్రాబాద్ అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నాను అని… కానీ అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ గెలుపే అంతిమ లక్ష్యంగా పనిచేస్తూ వచ్చానని అన్నారు. ఇప్పుడు కూడా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు నా అభిమానుల మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్ ని గెలిపించి మా భుజాలపై అసెంబ్లీ కి తీసుకుని వస్తాం.
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా గెలుపునకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తాం. ప్రస్తుత ఆరచకా.. కుటుంబ పాలన నుండి తెలంగాణ సమాజానికి విముక్తి కల్పిస్తాం అని తెలిపారు వారితో పాటు వారి సతీమణి
నాగులూరి ఇందుమతి గౌడ్, మాజీ చైర్మన్ ఇందిరమ్మ కమిటి, బౌద్ధ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్, సుమంత్ పాల్గొన్నారు.