Suryaa.co.in

Telangana

చదువు చిక్కుల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి మైనంపల్లి

– గతంలో బీఏ చదివానన్నారు
– తర్వాత ఇంటర్‌ అన్నారు
– ఇప్పుడు నిల్‌ అని అఫిడవిట్‌లో ఇచ్చారు
– భార్య ఆస్తుల వివరాలు ఇవ్వలేదు
– పోలీసు కేసులూ చెప్పలేదు
– మైనంపల్లిని అనర్హుడిగా ప్రకటించండి
– బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయిప్రసాద్‌ డిమాండ్‌

మల్కాజిగిరి నియోజకవర్గం ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం. తన కుమారుడిని మెదక్ అభ్యర్థిగా టిఆర్ఎస్ ప్రకటించకపోవడంతో.. బిఆర్ఎస్ ను వీడి మైనంపల్లి హనుమంతరావు, కుమారుడు మైనంపల్లి రోహిత్ తో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఇదంతా అందరికీ తెలిసిన కథ కానీ తాజాగా మరోసారి మల్కాజిగిరి నియోజకవర్గం చర్చల్లోకి వచ్చింది.

మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడిన మైనంపల్లి హనుమంతరావు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో తన విద్య అర్హతను దాచి పెట్టారని ఎన్నికల కమిషన్కు బీజేవైఎం జాతీయ కోశాధికారి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు గతంలో ఎన్నికలలో పోటీ చేసే సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లో తాజాగా ఇచ్చిన అఫిడవిట్లో చాలా విషయాలను పొందపరచలేదని, ఇది సెక్షన్ 36(4 ) రిప్రెజెంటేషన్ ఆఫ్ పీపుల్ ఆక్ట్ 1951 కి విరుద్ధమని సాయి ప్రసాద్ తెలిపారు.

2014 పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే సమయంలో తన విద్యా అర్హత అలభామ యూనివర్సిటీ నుండి బి బి ఏ అని పొందవచ్చున మైనంపల్లి హనుమంతరావు 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో తన ఉన్నత విద్య అర్హత ఇంటర్మీడియట్ గా పేర్కొన్నారని , ప్రస్తుతం 2023 అసెంబ్లీ ఎన్నికలలో తన ఉన్నత విద్యార్హత NIL అని పేర్కొన్నారని, దీనిపై వెంటనే విచారణ జరిపించి మైనంపల్లి హనుమంతరావు దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశానని సాయి ప్రసాద్ తెలిపారు.

అంతేకాకుండా మైనంపల్లి హనుమంతరావు సతీమణి మైనంపల్లి వాణి పేరుపై కొన్ని కంపెనీలు ఉన్నా కూడా, హనుమంతరావు తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదని, ఇదే సంవత్సరంలో మైనంపల్లి హనుమంతరావు పై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్న విషయం కూడా, ఎన్నికల ఎఫిడవిట్లో మైనంపల్లి హనుమంతరావు కుట్రపూరితంగానే పేర్కొనలేదని బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయిప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

మైనంపల్లి హనుమంతరావు దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్ ను తిరస్కరించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్కు తాను ఫిర్యాదు చేసినట్లు సాయి ప్రసాద్ తెలిపారు. మూలుగుతున్న నక్కపై కొబ్బరి మట్ట పడినట్లు, ఇప్పటికే మల్కాజిగిరి నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతున్న సమయంలో… తాను పెంచి పోషించాను అని చెప్పుకునే క్యాడర్ కూడా తనతో పాటు నిలువ లేని సమయంలో, ఎన్నికల ఫిర్యాదు అందడం రానున్న రోజుల్లో మైనంపల్లి హనుమంతరావుకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుంతుందన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య.

సెక్షన్ 125 రిప్రెజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం మైనంపల్లి హనుమంతరావు దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరించవచ్చు
1. మైనంపల్లి హానుమంత్ రావ్ పై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన FIR No : 251/2023 తన అఫిడవిట్ తో పొందపరచలేదు
2. తన సొంత నివాసమైన ఇంటి నెంబర్ 1-11-55/1 , PTIN no : 1160105253 తన అఫిడవిట్ తో పొందపరచలేదు
3. 2014 లో అలబామా యూనివర్సిటీ డిగ్రీ పొందుపరిచారు, 2018లో ఇంటర్మీడియట్ అని అఫిడవిట్ లో పొందపరిచాడు, 2023 లో NIL అని పొందుపరిచారు.
4. మైనంపల్లి హనుమంతరావు భార్య మైనంపల్లి వాణి అరవింద్ రికార్డు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ శివశక్తి రియల్ టైర్స్ అనే సంస్థల్లో డైరెక్టర్ గా ఉంది కానీ ఇది అఫిడవిట్ లో పొందపరచలేదు.

ఈ విషయం పై బీజేవైఎం జాతీయ కోశాధికారి, టీమ్ సాయి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి.ఎం సాయి ప్రసాద్ మైనంపల్లి పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

LEAVE A RESPONSE