– ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం ప్రతినిధులు,బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో శేరిలింగంపల్లి బిఆర్ఎస్ నేత చిర్ర రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ను కలిశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 500 రూపాయలు ఉన్న దివ్యాంగుల పెన్షన్ ను 4,000 రూపాయలకి తెలంగాణ మొదటి సీఎం కెసీఆర్ పెంచారని ఎమ్మెల్సీ కవిత గుర్తుకు చేశారు..దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తుకు చేసారు. దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించడం, దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్ ను నాలుగు రెట్లు పెంచడం లాంటి అనేక గొప్ప కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
అయితే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్,ఏడాది దాటినా అమలు చేయకుండ మోసం చేసిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం RWPD 2016 చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని, దివ్యాంగులకు రిజర్వేషన్లను కూడా సరైన రీతిలో అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
దివ్యాంగులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, సబ్సిడీ రుణాలు, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని, తెలంగాణ దివ్యాంగుల సమైఖ్య సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితకు వినతి పత్రం అందజేసారు.