– బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ బలం నిరూపితం అయింది. 50 శాతం పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. పాలన గాలికొదిలేసి ఫుట్ బాల్ మ్యాచ్ లపై దృష్టి పెడితే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు. కేటీఆర్ ఆదేశాలతో 17 న బుధవారం సాయంత్రం 6 .30 గంటలకు తెలంగాణ భవన్ లో మహా పడిపూజ జరుగుతుంది. ఈ పూజకు కేటీఆర్ హాజరవుతారు మంచి సంకేతం ఇవ్వాలని అయ్యప్ప పూజను నిర్వహిస్తున్నాం. పూజకు అందరిని ఆహ్వానిస్తున్నాం.
రెండు విడతల్లో సగం స్థానాలు కాంగ్రెస్ పార్టీకి లేదు: బీ ఆర్ ఎస్ నేత చిరుమళ్ల రాకేష్ కుమార్
రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి అద్భుత విజయాలు వచ్చాయి. రెండు విడతల్లో సగం స్థానాలు కాంగ్రెస్ పార్టీకి లేదు. తెలంగాణ పల్లెలు చైతన్యవంతమైన పల్లెలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఓడించారు. కాంగ్రెస్ గ్రామాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతోంది.
తెలంగాణలో వ్యక్తిగత కక్షలు ఉండవు. ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయో తెలంగాణకు అదే సాంప్రదాయం తీసుకువచ్చారు. మెస్సితో ఫుట్ బాల్ మ్యాచ్ కు రేవంత్ రెడ్డి తన మనవడిని తీసుకువచ్చి ఆడించారు. బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు సమానంగా ఓట్లు వస్తే కాంగ్రెస్ గెలిచినట్లు ప్రకటించారు. మోరీల్లో బ్యాలెట్ పేపర్లు దొరుకుతున్నాయి. ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారు. మెస్సిని కలవడానికి రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లోను బిఆర్ఎస్ కు మంచి ఫలితాలు వస్తాయి. ప్రెస్ మీట్ లో బాలకృష్ణ ,సాయి తేజ రావు పాల్గొన్నారు.