Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం

విజయవాడ : టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిపట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి టీడీపీ కార్యాలయాన్ని సందర్శించింది. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ (అడ్మిన్ ఇంఛార్జ్ ) నూతలపాటి రవికాంత్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తాడికొండ ఇంచార్జి చిలకా విజయ కుమార్ , గుంటూరు జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ , మంగళగిరి నియోజక వర్గ ఇంచార్జి షేక్ సలీం ఘటనా స్థలాన్ని సందర్శించారు. తదనంతరం పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని ఈ ప్రతినిధి బృందం సూచించింది. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

LEAVE A RESPONSE