– ఉద్రిక్తత.. పోలీసుల నిర్బంధం మధ్య.. విద్యుత్ సౌద ముట్టడి విజయవంతం
– పోలీసుల కంచెలను చేధించుకొని విద్యుత్ సౌదకు వెళ్ళిన కాంగ్రెస్ నేతలు…
– రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
– సి.ఎల్.పి నేత భట్టి తో సహా ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్..
పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరల పెంపులను నిరసిస్తూ, విద్యుత్ చార్జీల పెంపును తగ్గించాలని డిమాండ్ చేస్తూ యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అనే నినాదంతో టిపిసిసి ఇచ్చిన వరస ఉద్యమాలలో భాగమైన విద్యుత్ సౌద ముట్టడి విజయవంతం అయింది. ఐదు ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటికే మండలాలలో ధర్నాలు, జిల్లా కేంద్రాలలో ధర్నాలను విజయవంతం చేసిన కాంగ్రెస్ గురువారం నాడు హైదరాబాద్ కేంద్రంగా విద్యుత్ సౌద, సివిల్ సప్లయ్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే గురువారం తెల్లవారుజామునుంచే పోలీసులు ముఖ్య నాయకుల ఇళ్లను చుట్టుముట్టి ఇళ్లను దిగ్బంధనం చేసి నాయకులను హౌజ్ అరెస్టులు చేశారు.
పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సి.ఎల్.పి నేత భట్టి విక్రమార్క, పి.ఎ.సి కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ పిసిసి అధ్యక్షులు వి.హనుమంతరావు, నాయకులు మల్లు రవి, హర్కర వేణుగోపాల్, దాసోజు శ్రవన్, వినోద్
రెడ్డి, బక్క జడ్సన్‌లతోపాటు పలువురు నాయకులను గృహ నిర్బంధాలు చేశారు. కాగా కాంగ్రెస్ నాయకుల అరెస్టులను మాజీ పిసిసి అద్యక్షులు, ఎం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తరువాత కొంత సేపటికి కాంగ్రెస్ నాయకులను విద్యుత్ సౌద వద్దకు వెల్లడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు.
దీంతో కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎం.ఎల్.ఎ శ్రీదర్ రెడ్డి, ఎం.ఎల్.సి జీవన్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మదు యాష్కిలు నెక్లెస్ రోడ్ వద్దకు వచ్చి ఇందిరమ్మ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడ నుంచి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలతో కలిసి విద్యుత్ సౌద వైపు వెల్లగా
ఖైదరాబాద్ ఫై ఓవర్ వద్ద పోలీసులు బారికేట్లు పెట్టి అడ్డుకున్నారు. కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉందని వారు అడ్డుకోవడంతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎం.ఎల్.ఎ శ్రీదర్ బాబు, ప్రచారకమిటీ చైర్మన్ మధు యాష్కి, యూత్ నాయకులు అనిల్ యాదవ్, శివసేనరెడ్డి తదితరులు బారికేట్లు ఎక్కి అవతలవైపు దుంకి విద్యుత్ సౌద వైపు దూసుకెళ్ళారు.
దాంతో వారికి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపైన భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఫిరోజ్ ఖాన్, ఓబిసి సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ మైనారిటీ సెల్ చైర్మన్ సోహల్, ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు వెంకట్, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కొద్ది మందికి అనుమతి ఇవ్వగా అక్కడ నుంచి పాదయాత్రగా విద్యత్ సౌదకు వెళ్ళి ట్రాన్స్‌కో సి.ఎం.డి ప్రభాకర్‌రావుతో సమావేశమయ్యి విద్యుత్‌చార్జీలు పెంపుదల ప్రజా వ్యతిరేకమని వాటిని ఉపసంహరించుకోవాలని సూచించారు. ఈ కార్య్రకమంలో రేవంత్ రెడ్డి, సి.ఎల్.పి నేత భట్టి విక్రమార్క, ఎం.ఎల్.ఎ శ్రీదర్‌బాబు, ఎం.ఎల్.సి జీవన్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, నాయకులు మల్లు రవి, అనిల్ యాదవ్, వినోద్ రెడ్డి తదతరులు పాల్టొన్నారు.
మహిళా కాంగ్రెస్ నాయకురాలు విద్యారెడ్డి అస్వస్థత..
కాగా మహిళా కాంగ్రెస్ చీప్ సునితారావు ఆధ్వర్యంలో పలువురు విద్యుత్ సౌద ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకొని వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళా నాయకురాలు
విద్యారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధ సమస్యలు రావడంతో ఆమెను హుటాహుటిన నాయకులు నిమ్స్ ఆసుప్రతికి తరలించారు. ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి ఆద్వర్యంలో ముట్టడికి ప్రయత్నించగా వారిని అరెస్టు చేసి ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.