కాంగ్రెస్ పార్టీ వేలం పాట గా మారింది
భావోద్వేగానికి గురై కంట తడి పెట్టిన పాల్వాయి స్రవంతి
కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు. నేడు కాంగ్రేస్ పార్టీ సిద్ధాంతాలతో కాదు కేవలం డబ్బు డబ్బు అనే నినాదం తో నడుస్తుంది.ఎంతో మందిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిలువెత్తున వేలం పాట గా మారింది. పార్టీ ఫిరాయింపు దారులతో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది.
ఈరోజు ఏం మొఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయమని అడుగుతారు? కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ ది అని అనడం తో కాంగ్రేస్ పార్టీ లో ఏం జరుగుతుంది? ఇన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీ నా వంతుగా కృషి చేస్తూ పని చేశాను. కానీ నేడు జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీ ని విడాల్సి వస్తుంది. ఒక బ్రోకర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది.