– రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో టీడీపీ
– ‘సూర్య’ వెబ్‌సైట్ సర్వేలో సుస్పష్టం
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీకి.. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయని తేలిపోయింది. ‘‘సూర్య’’ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్ సర్వేలో ఈ విషయం స్పష్టమయింది. ఆ మేరకు నెటిజన్లు వివిధ పార్టీలకు వేసిన ఓటులో, కాంగ్రెస్ ఒక్కటే అగ్రభాగాన నిలిచింది.
ఆ ప్రకారంగా.. కాంగ్రెస్ పార్టీకి 55.43 శాతం ఓట్లు, బీజేపీకి 26.09 శాతం, టీడీపీకి 14.13 శాతం, షర్మిల వైఎస్సార్‌టీపీకి 2.17 శాతం, బీఎస్పీకి 2.17 శాతం ఓట్లు లభించాయి.
దీని ప్రకారం.. తెలంగాణ ప్రజలు, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌కు.. కాంగ్రెస్ పార్టీని మాత్రమే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు స్పష్టమయింది. అంటే బీఎస్పీ, వైఎస్సార్‌టీపీ వంటి పార్టీలు, ఏ స్థాయిలో కూడా ప్రభావితం చేయలేవని స్పష్టమవుతోంది.