Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ అంటే కరువు

– రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్

కరువు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరువు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ ఎద్దేవా చేశారు. ‘‘మార్పు కోసం కాంగ్రెస్ అంటే…. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల మార్పు… కాంగ్రెస్ మార్పు అంటే కరెంటు కోతలు. కాంగ్రెస్ మార్పు అంటే కరువు. కాంగ్రెస్ మార్పు అంటే రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ మార్పు అంటే అధికారులకు బెదిరింపులు. కాంగ్రెస్ మార్పు అంటే ఎమ్మెల్యేలు పార్టీ మారడం.కాంగ్రెస్ మార్పు అంటే కహానీ మాత్రమే.’’ అని చురకలు అంటించారు.
ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాళేశ్వరం, మిషన్ కాకతీయతో బోర్లు రీచార్జి అయినయ్ అని బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బాలు కొట్టినపుడు, ప్రతిగా కాంగ్రెస్ మిషన్ కాకతీయ, భగీరథ ఫెయిల్ అయిందని కాళేశ్వరం కుంగిపోయిందని విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. .దాని మీద పూర్తి అవగాహన ఉన్నప్పడు కరువు పరిస్థితిలో ప్రత్యామ్నా చర్యలకు ఎందుకు తీసుకోలేదు..?

ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం అవినీతి, విద్యుత్ విషయంలో అధికారుల మీద మాత్రమే చర్యలు తీసుకుంటూ దాని వెనుక ఉన్న అసలు సూత్ర దారులను వదిలేస్తుంది. కాంగ్రెస్ అంటే రాష్ట్రంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ. దేశంలో సగం స్థానాల్లో కూడా పోటీ చేయలేని కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పడం హస్యాస్పదం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులు లేరు.

బీఆర్ఎస్ ఎంఐఎంతో ములాఖత్ అవ్వడం తప్ప వారికి గత్యంతరం లేదు. కాంగ్రెస్ పూర్తిస్థాయిలో అధికారంలో ఉంటుందనే నమ్మకం వాళ్లకు లేదు. కాంగ్రెస్ నాయకులు వాళ్ల కుర్చీలు వాళ్లే లాక్కుంటారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లాగ బిజెపికి ఇతర పార్టీలనుండి నాయకులను లాక్కునే సంస్కృతి లేదు. ఆ సంస్కృతి కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నది.

కాంగ్రెస్ లలో గెలిచిన వారు బీఆర్ఎస్ లోకి వెళ్లి ఆ పార్టీకి మద్దతు పలికారు. ఇపుడు బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారం కాపాడుతున్నారు. క్విడ్ ప్రో కో పద్దతిలో ఒకరికొకరు మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్ లోని అవినీతి నాయకులకు ఆర్ & బీ టాక్స్ వసూలు చేసి పార్టీలో చేర్చుకుంటూ రాహుల్ గాంధీకి తెలంగాణ ఏటీఎంలా మార్చారు.

LEAVE A RESPONSE